అమ్మ అంజనాదేవి Bడే.. చిరు ఇంట బ్యూటిఫుల్ సెలబ్రేషన్
అంతేకాదు.. ఏ అమ్మకు అయినా పుట్టినరోజున ఇంతకంటే అందమైన సెలబ్రేషన్ ఇంకేం ఉంటుంది? ఇంటిల్లిపాదీ తనకు విషెస్ చెప్పడానికి ఎంతగా ఎదురు చూసారు.
ఎంత పెద్ద సూపర్‌స్టార్ అయినా తల్లి చాటు బిడ్డడే. ఇదిగో ఇక్కడ అమ్మ పుట్టినరోజును అంజనీపుత్రుడు చిరంజీవి ఎంత వైభవంగా జరుపుకున్నారో చూస్తున్నారుగా! ఇది ఎంత బ్యూటిఫుల్..! ఇలాంటి అరుదైన దృశ్యం వీక్షించేందుకు రెండు కళ్లు చాలవు. అంతేకాదు.. ఏ అమ్మకు అయినా పుట్టినరోజున ఇంతకంటే అందమైన సెలబ్రేషన్ ఇంకేం ఉంటుంది? ఇంటిల్లిపాదీ తనకు విషెస్ చెప్పడానికి ఎంతగా ఎదురు చూసారు. ఎంత అందంగా తమ ప్రేమను అభిమానాన్ని కనబరిచారు.
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు వేడుకల దృశ్యాలు చూడగానే, ఒక అందమైన వేడుకను వీక్షించామనే ఆనందం అభిమానుల్లో కనిపిస్తోంది. జనవరి 29న అమ్మ పుట్టినరోజు సందర్భంగా, మెగా ఫ్యామిలీ నివాసంలో వేడుకలు కన్నులపండుగను తలపించాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి ఓ చోటికి చేరారు. పూల వర్షంతో వెన్యూ వద్దకు అంజనాదేవిని స్వాగతిస్తూ.. ఎంతో ఆనందంగా ఈ సెలబ్రేషన్స్ ని నిర్వహించారు.
కుటుంబ సభ్యులందరి సమక్షంలో అమ్మ అంజనా దేవి పుట్టినరోజు కేక్‌ను కట్ చేసి, అందరి నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ `హ్యాపీ బర్త్‌డే` పాటను పాడారు. చిరు స్వయంగా ఈ వేడుకల ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. అమ్మపై చిరు ప్రేమ.. నాయనమ్మపై చరణ్ ప్రేమ చూసి మురిసిపోకుండా ఉండలేరు. ఉపాసన కొణిదెల ఎంతో ఆప్యాయంగా అందరితో కలిసిపోయి వేడుకలను ఆస్వాధించారు. మెగాస్టార్ చిరంజీవి సోదరీమణులు కూడా ఈ వేడుకల్లో సందడిగా కనిపించారు.
''అమ్మా... మేము నిన్ను మాటలకు మించి ప్రేమిస్తున్నాము. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా గౌరవిస్తాము. ఈ స్పెషల్ డే సందర్భంగా మీకు ఇదే విషయం చెప్పాలనుకుంటున్నాము''అని చిరు ఈ వీడియోకు అందమైన వ్యాఖ్యను జోడించారు. ప్రస్తుతం అమ్మ అంజనా దేవి పుట్టినరోజు వేడుకల వీడియో అంతర్జాలంలో దూసుకుపోతోంది. మెగాభిమానుల నుంచి అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.