అనుపమని బోల్డ్ గా చూపించాలనేం కాదా?
'టిల్లుస్వ్కేర్' లోనే లిల్లీ పాత్రకి నేహాశెట్టినే కొనసాగిస్తే బాగుండేదని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేసారు
'టిల్లు స్క్వేర్' లో తెరపై హీరోయిన్ రాధిక పాత్ర ఎంత గొప్పగా పండిందో తెలిసిందే. ఆ సినిమా విజయంలో రాధిక పాత్ర కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పాత్రకి నేహాశెట్టి నూరుశాతం న్యాయం చేసింది కాబట్టే సాధ్యమైంది. రాధిక పాత్రలో నేహా హవభవాలు..ఆహార్యం ప్రతీది పాత్రని ఎంతో గొప్పగా హైలైట్ చేసింది. ఆ పాత్రతో యూత్ ఐకాన్ గా మారిపోయింది నేహశెట్టి.
'టిల్లుస్వ్కేర్' లోనే లిల్లీ పాత్రకి నేహాశెట్టినే కొనసాగిస్తే బాగుండేదని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేసారు. కానీ సిద్దు జొన్నల గడ్డ-మల్లిక్ రాం ఆ పాత్రలో కొత్త నటిని చూపించాలని అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేసారు. ఎంతో మంది భామల్ని పరిశీలించి చివరికి ఆ పాత్రకు అనుపమ మాత్రమే సరితూగు తుందని మల్లిక్ రామ్ ఫైనల్ చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో ఆ అనుపమ లిల్లీ పాత్రని ఎంత బోల్డ్ గా హైలైట్ చేస్తున్నారో? తెలుస్తుంది.
ఇలా హైలైట్ చేయడంపై కొంత నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. బోల్డ్ గా చూపించడం కోసమే అనుపమని తీసుకున్నారా? అన్న సందేహాలు తెరపైకి వస్తోన్న నేపథ్యంలో తాజాగా వాటిని నివృతి చేసాడు దర్శకుడు. ఇందులో లిల్లీ పాత్ర సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్ర కోసం మడోన్నా సెబాస్టి యన్..మీనాక్షి చౌదరి ని పరిశీలించాం. కానీ వాళ్లకన్నా అనుపమ బెటర్ అనిపించింది.
తనని బోల్డ్ గా చూపించాలని లిల్లీ పాత్ర రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి అనుపమ వంద శాతం న్యాయం చేసింది. వాస్తవానికి ఆపాత్ర కోసం ఆమెని ఎంపిక చేస్తే తప్పుకుంది. కథలోని బోల్డ్ అంశాలు నచ్చకే తను తప్పుకుందని అంతా అనుకున్నారు. డేట్లు కుదరక తప్పుకుంది. ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకుంది' అని అన్నారు.