బ్యాంకాక్ స్ట్రిప్ క్లబ్‌లో పెద్ద హీరో షికార్లు?
అయితే అలాంటి చోటికి వెళ్లాడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అంతేకాదు రెడ్ లైట్ ఏరియాలోని ఆ స్ట్రిప్ క్లబ్ లో చొక్కా బటన్స్ విప్పి స్వేచ్ఛగా తిరిగాడు.
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేక దేశం బ్యాంకాక్. ఈ దేశంలో స్వేచ్ఛకు కొదవ లేదు. అక్కడ స్ట్రిప్ క్లబ్ లు కూడా అంతే ఫేమస్. వీటిలో ఒంటిపై నూలు పోగైనా లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు నృత్యం చేస్తుంటారు. పాపులర్ రెడ్ లైట్ ఏరియాలో అది ఒక షో స్టాపింగ్ డెస్టినీ. అలాంటి క్లబ్ ని చూడాలని చాలామంది యూత్ కలలు కంటారు. థాయ్ మసాజ్ లతో పాటు క్లబ్‌లలో అమ్మాయిలతో స్వేచ్ఛగా విహరించే అవకాశం ఇక్కడ ఉంది. డబ్బు ఖర్చవుతుంది కానీ, సుఖానికి కొదవేమీ ఉండదు.
అయితే అలాంటి చోటికి వెళ్లాడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అంతేకాదు రెడ్ లైట్ ఏరియాలోని ఆ స్ట్రిప్ క్లబ్ లో చొక్కా బటన్స్ విప్పి స్వేచ్ఛగా తిరిగాడు. అతడిని చూసిన భారతీయ విజిటర్స్ పిచ్చెక్కిపోయారు. బ్యాంకాక్‌లోని ఎక్సోటిక్ పై***వై అనే స్ట్రిప్ క్లబ్‌ను సందర్శించిన తర్వాత అమితాబ్ బచ్చన్ `మైండ్ బ్లాంక్` అయిందని కూడా అన్నారు. ఈ మొత్తం అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు దర్శకుడు అపూర్వ లఖియా. 2005 యాక్షన్ థ్రిల్లర్ `ఏక్ అజ్నబీ` చిత్రీకరణ సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను స్ట్రిప్ క్లబ్‌కు తీసుకెళ్లానని చెప్పాడు అపూర్వ.
అమితాబ్ బచ్చన్ బ్యాంకాక్ చుట్టూ చూపించమని అడిగారట. అయితే దానికి అతడు మొదట తిరస్కరించాడు. సార్, ఇది పట్‌పాంగ్.. నేను మిమ్మల్ని తీసుకెళ్తే ఇక్కడ లైవ్ షోలు ఉన్నాయి.. అల్లర్లు జరుగుతాయి అని అపూర్వ ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ `మనం వెళ్తాం` అని అమితాబ్ మొండి పట్టు పట్టారు. దీంతో కాదనలేక వెళ్లాల్సి వచ్చింది. ఆ ఇద్దరూ అర్జున్ రాంపాల్, విక్రమ్ చత్వాల్, పెరిజాద్ జొరాబియన్, బంటీ వాలియా ఇతర నటీనటులతో కలిసి ఒక రెడ్ లైట్ జిల్లాను సందర్శించారు.
అమిత్ జీ బటన్లు ఉన్న చొక్కా ధరించాడు. ఆయన థాయ్ ధోతీ లాంటిది ధరించాడు. పట్పాంగ్‌లో నడుస్తున్నారు. బిగ్ బితో కలిసి మేమంతా ఎక్సోటిక్ పు**య్ అనే ప్రదేశానికి వెళ్తున్నాం. అది ఈ షోలన్నీ జరిగే క్లబ్ పేరు. అమిత్ జీ అలాంటి షోను ఎప్పుడూ చూడలేదు.. కాబట్టి ఊహించుకోండి.. అక్కడ అమితాబ్ ని చూసి భారతీయులు పిచ్చివాళ్లయ్యారు. ఆయన జుహులో ఉన్నట్లుగా నడుచుకుంటూ బయల్దేరారు.. అని నాటి అనుభవాన్ని అపూర్వ చెప్పారు.
అమితాబ్ బచ్చన్ ఈ షోను `మైండ్ బ్లోయింగ్` అని చెప్పారట. తెల్లవారుజామున 2:30-3 గంటల వరకూ అక్కడ షికార్లతో ఎంజాయ్ చేసి వచ్చారు. `ఏక్ అజ్నబీ` అనేది టోనీ స్కాట్ రాసిన `మ్యాన్ ఆన్ ఫైర్` అనే నవల ఆధారంగా తీసిన సినిమాకి రీమేక్. బిగ్ బి కల్నల్ సూర్యవీర్ `సూర్య సింగ్` పాత్రను పోషించారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, లారా దత్తా, సంజయ్ దత్ కూడా అతిధి పాత్రలు పోషించారు.
అమితాబ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే... రజనీకాంత్ తో కలిసి నటించిన `వేట్టయన్` సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ఇది యావరేజ్ గా ఆడింది. `ది ఇంటర్న్` హిందీ రీమేక్‌లో దీపికా పదుకొనేతో కలిసి బిగ్ బి నటిస్తున్నారు. గత సంవత్సరం `కల్కి 2898 AD`లోను దీపిక- అమితాబ్ జోడీ కనిపించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ పోస్ట్ అపోకలిప్టిక్ చిత్రం హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన కథతో రూపొంది బ్లాక్ బస్టరైంది. కల్కి 2898 ADలో కమల్ హాసన్, ప్రభాస్, దిశా పటాని కూడా ఈ చిత్రంలో నటించారు. తదుపరి సీక్వెల్ లోను అమితాబ్ నటించనున్నారు.