అంద‌మైన అమ్మాయిల‌కు వ‌ర్మ గురించి అలా!

రామ్ గోపాల్ వ‌ర్మ గురించి గొప్ప‌గా చెబితే ఆశ్చ‌ర్య‌పోవాలి. చెడుగా చెబితే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నేముందు? కాంట్ర‌వ‌ర్శీకి వ‌ర్మ కేరాఫ్ అడ్ర‌స్ అన్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం

Update: 2025-02-25 01:30 GMT

రామ్ గోపాల్ వ‌ర్మ గురించి గొప్ప‌గా చెబితే ఆశ్చ‌ర్య‌పోవాలి. చెడుగా చెబితే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నేముందు? కాంట్ర‌వ‌ర్శీకి వ‌ర్మ కేరాఫ్ అడ్ర‌స్ అన్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. అలాంట‌ప్పుడు వ‌ర్మ గురించి మంచి గా చెప్పేవారు ఎవ‌రుంటారు? ఆయ‌న సినిమాల గురించి త‌ప్ప‌. తాజాగా రాంగోపాల్ వ‌ర్మ నిర్మిస్తున్న `శారీ` సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా వ‌ర్మ‌-ఆరాధ్య‌లు ఇంట‌ర్వ్యూలో బిజీగా ఉన్నారు.

ఈ క్ర‌మంలో వ‌ర్మ గురించి ప‌ని గ‌ట్టుకుని కొంద‌రు చెడుగా ప్ర‌చారం చేసిన‌ట్లు ఆరాధ్య తెలిపింది. `వ‌ర్మ నుంచి అవ‌కాశం రాగానే ఆయ‌న గురించి మీకు ఎవ‌రైనా ఏమైనా చెప్పారా? అని ఆరాధ్య‌ని ప్ర‌శ్నించ‌గా అమ్మ‌డు ఇలా స్పందించింది. `ఆర్జీవీ ఎవ‌రో మొద‌ట నాకు తెలియదు. ఆయ‌న న‌న్ను వెతుకుతున్నార‌న్న‌ విష‌యం తెలిసి నా క్రేజ్ పెరిగింది. సోష‌ల్ మీడియాలో నా ఫాలోవ‌ర్స్ పెరిగారు.

ఈ క్ర‌మంలోనే వ‌ర్మ గురించి మంచిగానూ చెప్పారు..చెడుగాను చెప్పారు. వ‌ర్మ సినిమాలు చూసాను. కొంత మంది అషురెడ్డి-ఆర్జీవీ వీడియో పంపించి ఆయ‌న‌తో సినిమా తీయ‌కు. తీస్తే ఇలాగే ఉంటుంది. జాగ్ర‌త్త ఉండు అని స‌ల‌హా ఇచ్చారు. కానీ వాటిని నేను ప‌ట్టించుకోలేదు. వ‌ర్మ‌ని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న చాలా క్లారిటీగా కనిపించారు. సినిమాలో నేను చాలా కంప‌ర్ట్ బుల్ గా న‌టించాను` అంది.

రామ్ గోపాల్ వ‌ర్మ‌లో బోల్డ్ యాంగిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెర‌పై హీరోయిన్ల‌ను త‌న‌దైన శైలిలో బోల్డ్ గా ఆవిష్క‌రించ‌డంలో ఆయ‌న త‌ర్వాతే. హీరోయిన్ అందాలు ఆవిష్క‌రించే క్ర‌మంలో వ‌ర్మ కెమెరా యాంగిల్స్ హైలైట్ అవుతుంటాయి. రొమాంటిక్ చిత్రం చేసినా..సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్లు చేసినా? వ‌ర్మ హీరోయిన్ ని అదే తీరున హైలైట్ చేస్తుంటారు. శారీ లోనూ ఇలాంటి స‌న్నివేశాల‌కు కొద‌వ‌లేదు. ` శారీ` చిత్రాన్ని గిరీశ్ కృష్ణ కమల్ తెర‌కెక్కించారు.

Tags:    

Similar News