ఐదేళ్ల ప్రియానిక్ కాపురంపై స్నేహితుడి కామెంట్
నిక్ జోనాస్- ప్రియాంక చోప్రా దంపతుల ఆదర్శ దాంపత్యం ఇప్పుడు ఇండియా సహా వరల్డ్ వైడ్ డిబేట్‌గా మారింది.
నిక్ జోనాస్- ప్రియాంక చోప్రా దంపతుల ఆదర్శ దాంపత్యం ఇప్పుడు ఇండియా సహా వరల్డ్ వైడ్ డిబేట్‌గా మారింది. ఈ జంట విడిపోతుందని పాపులర్ అమెరికన్ మ్యాగజైన్ పెళ్లయిన కొద్దిరోజులకే పుకార్లు సృష్టించింది. కానీ ఈ జంట అన్యోన్య దాంపత్యం అన్ని పుకార్లకు సమాధానంగా మారింది. ఐదు సంవత్సరాలకు పైగా సంతోషకర దాంపత్యం అందరికీ స్ఫూర్తి. నిక్ జోనాస్ సోదరుడు జో జోనాస్ తన భార్య సోఫీ టర్నర్ నుంచి విడిపోవడం ఆ కుటుంబంలో పెద్ద కుదుపు. ఆ సమయంలో ప్రియాంక చోప్రా భారతీయత సాంప్రదాయం నిక్ తో తన బంధాన్ని బలోపేతం చేసిందని ఆ కుటుంబంలో పెద్దలు భావించినట్టు కూడా కథనాలొచ్చాయి.
ఇక నిక్- ప్రియాంక చోప్రా జంట వారి కంటూ ఒక సొంత విధానాన్ని అనుసరిస్తారు. ముఖ్యంగా నిక్ తన కాపురంపై ఇతర పాశ్చాత్య ప్రభావం, ఇతరుల ప్రభావం పడకుండా చాలా జాగ్రత్త పడతాడని అతడి స్నేహితుడు ఒకరు వ్యాఖ్యానించారు. పెళ్లి బంధానికి ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా ప్రియానిక్ బలమైన శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.
నిక్ జోనాస్ కుటుంబంలో పెద్దవాడు కానప్పటికీ తన మ్యూజిక్ బ్యాండ్ ని నడిపించడంలో, అదే సమయంలో వైవాహిక బంధాన్ని నడిపించడంలో అతడు స్వయంగా నాయకత్వం వహిస్తాడని స్నేహితుడు వెల్లడించాడు. నిక్ లోని పరిపూర్ణతావాద స్వభావం ప్రియాంకతో అతడి బంధాన్ని బలంగా మార్చిందని అతడు చెప్పాడు.
నిక్ సోదరుడు జో జోనాస్ ఐదేళ్ల కాపురం బ్రేక్ అయింది. కస్టడీ వివాదంలో బంధం ముగిసింది. కానీ జో జోనాస్ మాదిరిగా కాకుండా నిక్ మరింత జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా ఉంటాడని స్నేహితుడు అన్నారు. నిక్ ప్రియాంకను దేనికీ డిమాండ్ చేయడు.. కానీ భర్తగా తనకు తానుగా ఉన్నత ప్రమాణాలను ఏర్పరుచుకుంటాడని స్నేహితుడు తెలిపాడు.
అతడు బాధ్యతాయుతంగా ఉంటాడు. ఇంటి పనులకు రిమైండర్‌లు అవసరం లేదు. ప్రియాంక ప్రయణాలు చేస్తుంది.. వర్క్ కమిట్ మెంట్ కోసం కొత్త వ్యక్తులను కలవడానికి వెళుతుంది. నిక్ ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాడు. అతడు చాలా క్రమశిక్షణ కలిగినవాడు. కష్టపడి పనిచేసేవాడు. బాలనటుడిగా సవాళ్ల గురించి తెలుసుకుని పరిణతి చెందాడని ఒక ఇన్‌సైడర్ వెల్లడించాడు. అతడు ఒక హెచ్చరిక కథగా తన జీవితం మారకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతడి కీర్తి ప్రతిష్ఠలు పెరిగే క్రమంలో పెళ్లి బంధం బలంగా ఉండేలా చూసుకోవడానికి కట్టుబడి ఉన్నాడు.
నిక్ - ప్రియాంక ఇటీవల ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహానికి హాజరయ్యారు. వేడుకలో అందంగా నృత్యం చేస్తూ పెళ్లిని ఆస్వాధించారు. ప్రియాంక కుటుంబంతో గొప్ప అనుబంధం ఏర్పరచుకోవడానికి నిక్ రెగ్యులర్ గా భారతదేశాన్ని సందర్శిస్తాడు. న్యూజెర్సీలోని తన కుటుంబానికి పీసీని పరిచయం చేసిన తర్వాత వారి మధ్య అనుబంధం బలంగా మారింది.