పుష్ప-2 బ్లాక్ బస్టర్.. ఆయన భారీగా నష్టపోయారా?

ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో వసూళ్లు సాధించిన పుష్ప-2.. హిందీలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు హైయెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.

Update: 2025-02-24 22:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప 2: ది రూల్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఆ సినిమా.. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. మరిన్ని ఘనతలు సాధించి సత్తా చాటింది పుష్ప-2.

ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో వసూళ్లు సాధించిన పుష్ప-2.. హిందీలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు హైయెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. బీ టౌన్ సినీ ప్రియులను వేరే లెవెల్ లో మెప్పించింది. రిపీట్ మోడ్ లో థియేటర్లకు రప్పించింది. ఓవరాల్ నార్త్ లో రూ.820 కోట్లకుపైగా మూవీ రాబట్టింది.

అదే సమయంలో 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప: రి రైజ్ మూవీ కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. అప్పుడు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే పుష్ప-2 కన్నా తక్కువ అయినా.. అదే తక్కువ నెంబర్ కాదు. పుష్ప-1 అక్కడ భారీ సక్సెస్ అవ్వడంలో గోల్డ్‌ మైన్స్ టెలిఫిల్మ్స్ మనీష్ షా కీలక పాత్ర పోషించారు.

అయితే ఇప్పుడు పుష్ప-2ను మాత్రం ఆయన డిస్ట్రిబ్యూట్ చేయలేదు. సినిమాపై ముందు నుంచే అంచనాలు ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం తప్పుకున్నారు. దీంతో ఏం జరిగిందోనని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కావాలని తప్పుకున్నారా లేక ఏమైనా జరిగిందా ఇండస్ట్రీ వర్గాల్లో అంతా మాట్లాడుకున్నారు.

పుష్ప 1 హిందీ హక్కులు రూ.30 కోట్లకు కొనుగోలు చేసిన మనీష్ షా.. భారీ లాభాలు సంపాదించారు. ఆ తర్వాత నిర్మాతలు వచ్చిన ఆదాయంలో వాటా అడిగారని తెలుస్తోంది. అందుకు మనీష్ ఒప్పుకోలేదని సమాచారం. ఆ తర్వాత అనిల్ తడానీ.. పుష్ప 2 డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ.200 కోట్లకు సొంతం చేసుకున్నారు.

అయితే ఇప్పుడు మనీష్.. భారీ లాభాలు మిస్ అయ్యారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో మనీష్.. పుష్ప-2 రైట్స్ ను తీసుకుంటే ఇంకా రాణించి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక బిజినెస్ అని గుర్తుంచుకోవాలి. ఆయన నష్టపోలేదు.. కేవలం బ్లాక్ బస్టర్ లో భాగం కాకపోవడం వల్ల లాభాలు మాత్రమే మిస్ అయ్యారు!

Tags:    

Similar News