హీరో ట్రస్టులో కరోనా: 21మందికి వైరస్

Update: 2020-05-27 05:15 GMT
హీరో, దర్శకుడు, కొరియో గ్రాఫర్ గా తమిళ, తెలుగు భాషల్లో చిరపరిచితుడైన రాఘవ లారెన్స్  కు అనుకోని షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ లో మహమ్మారి కలకలం రేపింది. చెన్నైలోని అశోక్ నగర్ లో అనాథల కోసం రాఘవ లారెన్స్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు.ఇక్కడ ఎంతో మంది ఆశ్రయం పొందుతున్నారు.

చెన్నై కార్పొరేషన్ సిబ్బంది తాజాగా ఇంటింటికి వైరస్ పరీక్షలు నిర్వహించారు. ట్రస్ట్ లోని సిబ్బందికి చేశారు. ఇందులో ఉన్న వారిలో 21మందికి మహమ్మారి సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది.  లారెన్స్ ట్రస్టులోని 18మంది పిల్లలకి.. ముగ్గురు ఉద్యోగులకు వ్యాధి సోకినట్టుగా రిపోర్టులో తేలింది. మొత్తంగా 21మందికి నిర్ధారణ అయ్యింది.   వీరందరినీ చెన్నైలోని లయోలా కాలేజీకి తరలించి చికిత్సనందిస్తున్నారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న పలువురికి లక్షణాలు బయటపడడంతో పరీక్షలు చేయగా నిర్ధారణ అయ్యింది. దీంతో వీరందరినీ ఆస్పత్రికి తరలించి ట్రస్టును మూసివేశారు. దీన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.
Tags:    

Similar News