మహర్షి : భయపడి 8 కోట్లు అదనంగా ఖర్చు

Update: 2018-11-22 06:48 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ లో నటిస్తున్న విషయం తెల్సిందే. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ చిత్రంకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో 8 కోట్లు ఖర్చు చేసి ఒక పల్లెటూరును సృష్టించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమాలో ఎక్కువ శాతం ఆ పల్లెటూరులోనే ఉండబోతుందట. దానికి తోడు సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలన్నీ కూడా ఆ పల్లెటూరులోనే ఉండబోతున్న కారణంగా భారీ ఎత్తున సెట్‌ ను నిర్మించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

‘మహర్షి’ చిత్రంలోని ఆ పల్లెటూరు సీన్స్‌ సహజంగా వచ్చేందుకు నిజంగా పల్లెటూరులోనే చిత్రీకరించాలని దర్శకుడు వంశీ పైడిపల్లి భావించాడు. ఆంధ్రాలోని కొన్ని పల్లెటూర్లను కూడా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. అయితే ఎక్కువ రోజులు పల్లెటూరులో చిత్రీకరణ అంటే సాధ్యం కాదు. అది కాకుండా మహేష్‌ వంటి సూపర్‌ స్టార్‌ తో పల్లెటూరులో షూటింగ్‌ పెట్టుకుంటే అభిమానులతో రచ్చ రచ్చే అని దర్శకుడు వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. అభిమానుల తాకిడికి భయపడి రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఏకంగా 8 కోట్లతో పల్లెటూరును సెట్‌ వేయించారు.

వారం పది రోజులు అయితే పల్లెటూరులో చిత్రీకరణ పర్వాలేదు కాని - నెలల తరబడి మహేష్‌ వంటి స్టార్‌ తో పల్లెటూరులో చిత్రీకరణ చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిర్మాతలు కూడా భావించి - 8 కోట్ల అదనపు ఖర్చుకు వెనకాడలేదట. ప్రస్తుతం ఆ పల్లెటూరు సెట్‌ లో మహేష్‌ బాబుతో పాటు అల్లరి నరేష్‌ ఇంకా ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొంటున్నారు. రైతుల సమస్యల పట్ల ఉద్యమం చేసే సీన్స్‌ - మహర్షి వ్యవసాయం చేసే సీన్స్‌ - ఒకటి రెండు పాటలు కూడా ఆ సెట్‌ లోనే చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News