ఇరుగుపొరుగు భాషల్లో తమిళ బ్లాక్ బస్టర్ `విక్రమ్ వేద` రీమేక్ ప్రయత్నాలు తెలిసిందే. విజయ్ సేతుపతి- మాధవన్-వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని పుష్కర్-గాయత్రీ సంయుక్తంగా రూపొందించారు. థ్రిల్లర్ చిత్రాల్లోనే కొత్త ఒరవడిని సృష్టించిన ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయాలని చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. తెలుగులో విక్టరీ వెంకటేష్- రానా నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది రూమరే నంటు నిర్మాత సురేష్ బాబు తేల్చేశాడు. ఆ తరవాత తెలుగులో ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. విమర్శకులతో పాటు సామాన్య ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించే అవకాశం వుందని - మాధవన్ తన పాత్రలోనే కనిపించనున్నారని ప్రచారం జరిగింది. అదీ గాలివార్తే అని తేలడంతో తాజాగా మరో వార్త బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ఈ రీమేక్ లో నటిస్తారని - విజయ్ సేతుపతి పాత్రలో ఆమీర్ కనిపించడానికి ఆసక్తిని చూపిస్తున్నారని - మాధవన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ రీమేక్ ని మాతృక దర్శకులు పుష్కర్- గాయత్రి దర్శకత్వం వహించనున్నారని, `ఎంఎస్ థోనీ` ఫేమ్ నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని తాజా టాక్.
అయితే హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథ- కథనంలో పలు మార్పులు.. చేర్పులు చేసిన తరువాతే ఈ చిత్రాన్ని ప్రాపర్ గా బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ `థగ్స్ ఆఫ్ హిందుస్థాన్` దారుణ పరాజయం తరువాత హాలీవుడ్ సినిమా ఆధారంగా రూపొందుతున్న `ఫారెస్ట్ గంప్`లో నటిస్తున్నారు. అది పూర్తయిన తరువాతే ఆమీర్ `విక్రమ్ వేదా`రీమేక్ కు సమయం కేటాయించనున్నారట. వైనాట్ స్టూడియోస్, నీరజ్ పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ కరెక్ట్ గా కుదిరితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయనున్నారట.