ఇపుడు సోషల్ మీడియాలో 'ఆచార్య' మేనియా నడుస్తోంది. లేటెస్ట్ గా రిలీజైన్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్లో 6 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించిన ఈ టీజర్.. సుమారు 5 లక్షల లైక్స్ తో ట్రెండింగ్ లో కంటిన్యూ అవుతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో' అంటూ చెప్పిన మెగాస్టార్ డైలాగ్ కి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.
ఈ మూవీలో చరణ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. చెర్రీ పోషించే 'సిద్ధ' పాత్ర గూస్ బంస్ అనే రేంజ్ లో ఉంటుందట. అయితే.. లేటెస్ట్ టాక్ ప్రకారం ఇప్పుడు ఈ సినిమా షూట్ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ కూడా షూట్ లో ఉన్నారు. కానీ.. ఇంకా చెర్రీ పై ఇంట్రో షూట్ కంప్లీట్ కాలేదని సమాచారం.
అతి త్వరలో ఆ సన్నివేశాన్ని తెరకెక్కిస్తారని సమాచారం. ఈ షాట్ ను దర్శకుడు కొరటా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్.. రోమాలు నిక్కబొడిచేలా ఉంటుందని టాక్. మరి, చరణ్ ఎంట్రీ ఏ లెవల్లో ఉంటుందో తెలియాలంటే.. మే 13 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.