ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్… పుష్ప 2 స్థానం ఎంతంటే?
అక్కడ ఇండియన్స్ తో పాటు ఫారినర్స్ కూడా భారతీయ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇండియన్ సినిమాలకి ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువగా ఉన్న యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, అరబిక్ దేశాలలో మన సినిమాలకి ఆదరణ లభిస్తోంది. అక్కడ ఇండియన్స్ తో పాటు ఫారినర్స్ కూడా భారతీయ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలో బాగున్న సినిమాలకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో 'కల్కి 2898ఏడీ', 'పుష్ప 2' సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.
ఈ సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందులో భారీ వసూళ్లని సొంతం చేసుకున్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ రెండు చిత్రాలు 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించడం విశేషం. ఇక 'కల్కి 2898ఏడీ' మూవీ ఓవర్సీస్ మార్కెట్ లో 31.95 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ కేవలం 18 రోజుల్లోనే ఓవర్సీస్ లో 29.21 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది.
తద్వారా ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో 'పుష్ప 2' టాప్ 7లో ఉంది. వీటిలో మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ 'పఠాన్' మూవీ నిలిచింది. ఈ సినిమాకి లాంగ్ రన్ లో 49.33 మిలియల్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. దీని తర్వాత 'జవాన్' రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాకి 48 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ఓవర్సీస్ మార్కెట్ లో వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న 'బాహుబలి 2'కి ఏకంగా 46.98 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ లభించడం విశేషం.
ఇక 'కల్కి 2898ఏడీ' మూవీ 31.95 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో టాప్ 4లో ఉంది. రణబీర్ కపూర్ 'యానిమల్' చిత్రం 31 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో ఓవర్సీస్ మార్కెట్ లో టాప్ 5లో నిలిచింది. నెక్స్ట్ అమీర్ ఖాన్ 'దంగల్' మూవీ 30.7 మిలియన్ డాలర్స్ తో ఆరోస్థానంలో ఉంది. దీని తర్వాత 'పుష్ప 2' మూవీ ఉండటం విశేషం. నెక్స్ట్ లైన్ అప్ లో 'పద్మావత్', 'బజరంగీ భాయ్ జాన్', 'ధూమ్ 3' సినిమాలు నిలిచాయి.
పఠాన్ - $49.33M
జవాన్ - $48M
బాహుబలి 2 - $46.98M
కల్కి 2898ఏడీ $31.95M
యానిమల్ - $31M
దంగల్ -$30.7M
పుష్ప 2 - $29.21M (18D)***
పద్మావత్ - $29.15M
బజరంగీ భాయ్ జాన్ - $28.64M
ధూమ్ 3 - $28.33M