రీల్ లోనే కాదు.. రియ‌ల్ గానూ విల‌నేనా?

Update: 2018-10-23 08:41 GMT
రీల్ లో విల‌నిజం పండించినోళ్లంతా రియ‌ల్ లైఫ్ లో అలా అస్స‌లు ఉండ‌రు. కొన్ని సినిమాల్లో విల‌న్‌పాత్ర‌లు వేసిన వారిని చూసి.. రియ‌ల్ లైఫ్ లో ప‌లువురు భ‌య‌ప‌డుతుంటారు. ఇలాంటి ఉదంతాల్ని ప్ర‌స్తావిస్తూ.. తాము నిజ జీవితంలో సాదాసీదాగా ఉంటామ‌ని మ‌రీ మ‌రీ చెప్ప‌టం తెలిసిందే.

తాజాగా మాత్రం అందుకు భిన్నంగా రీల్ లో విల‌న్ పాత్ర‌ల్ని పోషించే ఒక న‌టుడు తాజాగా అరెస్ట్ అయ్యారు. ఆయ‌న‌పై డ్ర‌గ్స్ క‌లిగి ఉన్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ కావ‌టం సంచ‌ల‌నంగా మారింది. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే బాలీవుడ్‌.. టాలీవుడ్ న‌టుడు అజాజ్ ఖాన్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దూకుడు.. నాయ‌క్.. బాద్ షా త‌దిత‌ర సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు పోషించిన బాలీవుడ్ న‌టుడు అజాజ్ ఖాన్‌.. తాజాగా డ్ర‌గ్స్ క‌లిగి ఉన్న ఆరోప‌ణ మీద ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. నిషేధిత డ్ర‌గ్స్ ను క‌లిగి ఉన్న ఆయ‌న్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2.3 గ్రాముల ఎనిమిది మాత్ర‌లు.. రూ.2.2ల‌క్ష‌ల క్యాష్ తో పాటు అత‌డి సెల్ ఫోన్ ను నార్కోటిక్స్ విభాగం అదుపులోకి తీసుకుంది.

సినిమాల్లో కంటే వివాదాల‌తో ఎక్కువ‌గా స‌హ‌వాసం చేసే ఈ న‌టుడు బిగ్ బాస్ టీవీ షోతో పాపుల‌ర్ అయ్యాడు. ప‌లుమార్లు అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వివాదాల్లో క‌నిపించే అజాజ్ తాజాగా డ్ర‌గ్స్ క‌లిగి ఉన్న కేసులో అరెస్ట్ కావ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ముంబ‌యి కోర్టులో ఈ రోజు అత‌న్ని హాజ‌రుప‌ర్చ‌నున్నారు.
Tags:    

Similar News