ఆ నటుడు కూరగాయలు అమ్ముకునేలా చేసిన మహమ్మారి

Update: 2020-06-29 03:45 GMT
యావత్ ప్రపంచాన్ని కోలుకోలేనంతగా ప్రభావితం చేసిన క్రెడిట్ మాయదారి రోగానికి ఇవ్వాలి. ఆధునిక ప్రపంచంలో.. ఇప్పటివరకూ జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలకు మించిన విపత్కర పరిస్థితి తాజాగా నెలకొంది. రెండు ప్రపంచ యుద్ధాల్లో జరిగిన ప్రాణ నష్టం.. ఆస్తినష్టం కంటి ముందు కనిపించేది. అందుకు భిన్నంగా రక్తం చుక్క కారకుండా.. ఆయుధమన్నది లేకుండా.. ఎలాంటి గాయాలు లేకున్నా.. ప్రజలు పిట్టల్లా రాలి పోవటం.. ప్రపంచ దేశాలన్ని ఒకే సమయం లో ఒకే లాంటి కష్టాన్ని.. బాధను ఎదుర్కోవటం మాత్రం ఇదే తొలి సారిగా చెప్పాలి.

మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా లాక్ డౌన్ ను అమలు చేసిన వైనం తెలిసిందే. దగ్గర దగ్గర రెండు నెలల వరకూ సాగిన ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజాజీవితాలు దారుణంగా దెబ్బ తినటమే కాదు.. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మిస్ అయ్యేలా చేశాయి. లాక్ డౌన్ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పోయేలా చేసింది. ఇందుకు ఏ రంగం కూడా మినహాయింపు కాదు.

సినిమా రంగానికి చెందిన నటుడు జావేద్ హైదర్ అయితే.. ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్న వైనం చూసినప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేం. సుదీర్ఘ లాక్ డౌన్ నేపథ్యంలో అతగాడికి ఉపాధి కరువైంది. దీంతో.. తప్పని పరిస్థితుల్లో పొట్ట కూటి కోసం కూరగాయలు అమ్ముకుంటున్న వైనాన్ని బిగ్ బాస్ ఫేం డాలీ బింద్రా టిక్ టాక్ లో షేర్ చేయటం తో ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఇప్పటికే పలు రంగాలకు చెందిన వారు లాక్ డౌన్ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోవటంతో తమ గతాన్ని వదిలేసి.. పొట్టకూటి కోసం ఏదో ఒకటి వెతుక్కుంటున్న వారు లేక పో లేదు. ఒక నటుడు ఇలా కూరగాయలు అమ్ముకుంటున్న వైనం వైరల్ గా మారటమే కాదు.. పలువురిని అయ్యో అనుకునేలా చేస్తోంది. రానున్న రోజుల్లో ఇలాంటివి మరెన్ని చూడాల్సి వస్తుందో?
Tags:    

Similar News