* హయ్ ప్రియదర్శి ఎలా ఉన్నారు?
హాయ్ శ్యామ్ నేను బావున్నా మీరు బావున్నారా?
* నేను బానే ఉన్నా అండి - ఈ క్వారంటైన్ పీరియడ్ లో ఈ కుశల ప్రశ్నలు కూడా కాంట్రవర్సీలకు దారి తీయచ్చు కాదంటారా?
కాంట్రవర్సి అని నేను అనను కానీ ఈ కుశల ప్రశ్నలు మొన్న నిన్నటివరకు బోర్ కొట్టేవి - ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు - బాలేదు అంటే బాలేదు అనే చెప్పాలి. కోవిడ్ 19 వల్ల చిన్న జలుబు ని కూడా దాచుకోలేని పరిస్థితిలో ఉన్నాము. నేను ఐతే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను.
* మీ కెర్రిర్ కూడా సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఉంది?
(నవ్వులు) అవును ఫుల్ హెల్తీగా ఉంది. అందుకే ఈ మధ్యనే సినిమాలుతో పాటు వెబ్ సిరీస్ లు కూడా షురూ చేశాను. అన్నపూర్ణ బ్యానర్ వారు తీసిన లూజర్ అనే వెబ్ సిరీస్ లో నటించాను. ఈ సిరీస్ జీ 5 యాప్ లో మే 15 నుంచి స్ట్రీమ్ అవ్వబోతుంది.
* మళ్ళీ బ్యాక్ టూ వెబ్ మీడియం అన్న మాట?
ఎస్ ఉన్న మాటే - నేను షార్ట్ ఫిలిమ్స్ నుంచే నా కెర్రిర్ స్టార్ట్ చేసాను. అందుకే ఇన్ని సినిమాల్లో నటిస్తున్నా కూడా నాకు వెబ్ మీడియా మీద రెస్పెక్ట్ పోలేదు. అందుకే లూజర్ కథ నచ్చగానే వెంటనే ఈ వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయ్యాను.
* అంటే హీరో గా కెర్రిర్ కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చా?
అసలు సమస్య ఇక్కడే మొదలు అవుతుంది. నేను ఒక ఇమేజ్ చట్రం లో ఇర్రుక్కుపోదలుచుకోలేదు. నా వరకు నేను యాక్టర్ ని మాత్రమే. ఒక కథ నా దగ్గరకు వచ్చాక నేను అందులో కమెడియన్ గా యాక్ట్ చేస్తానా - లేక హీరో గా యాక్ట్ చేస్తున్నాన అనే థాట్స్ నా మైండ్ లోకి రావు. నాకు ఆ కథ లో క్యారెక్టర్ నచ్చింది చేస్తున్నా అంతే. నేను యాక్టర్ గా కొనసాగాలి అనుకుంటున్న.
* సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది ఓటిటి లు ఎక్కువ ఐతే థియేటర్ కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతారు అని వాదిస్తున్నారు. ఒక యాక్టర్ గా మీ స్పందన ఏంటి?
యాక్టర్ గా ఆలోచిస్తే నాకు రెండు సమానమే. కానీ ఓటిటి లు వల్ల థియేటర్ కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతారు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే థియేటర్ ఇచ్చే ఎక్స్ పీరియన్స్ ఇంట్లో కూర్చొని చూసే ఓటిటి ఇవ్వదు. అల అని 8 గంటలు 20 గంటలు చెప్పే కాన్సెప్ట్ ని థియేటర్ టైం కి కుదించి చెప్పలేం. ఈ రెండు ఒక్కటి కావు, ఒక దాని వల్ల మరొక దానికి లాభమే కానీ నష్టం రాదు అని నేను బలంగా నమ్ముతున్న. ఐతే ప్రస్తుతం సినిమాలు లేకపోవడం వల్ల ఓటిటి లు చూస్తుంటారు. మళ్ళీ అన్ని సర్దుకున్న వెంటనే థియేటర్ పరిస్థితి, సినిమా మార్కెట్ అన్ని ఒక్కసారి గా ఊపందుకుంటాయి అని నేను నమ్ముతున్న.
* ఎక్కడో మొదలు పెట్టి ఇప్పుడు అన్నుపూర్ణ బ్యానర్ లో హీరోగా నటించే రేంజ్ కి వచ్చారు - ఎలా అనిపిస్తుంది?
దీనికి ముఖ్య కారణం నన్ను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాతలు - దర్శకులు - రైటర్స్. రాజు అనే నిర్మాత - నన్ను నమ్మి మల్లేశం అనే సినిమా చేశాడు. దీంతో అప్పటి వరకు 10 నుంచి 15 నిముషాలు ఉండే నా రోల్స్ కాస్త ఇప్పుడు 2 గంటలకు పైన పెరిగాయి. అన్నపూర్ణ బ్యానర్ ఫ్యామిలీ లోనే హీరోలు ఉన్నారు. వారితో లూజర్ తీయచ్చు కానీ నా మీద నమ్మకం తో నన్ను తీసుకున్నారు. ఇవ్వన్ని సినిమా మీద ప్యాషన్ ఉంటేనే చేయగలం. ఇక మీరు అడిగినట్లు ఈ రేంజ్ కి నేను రావడానికి నాకు వచ్చిన అవకాశాలు - ఆ అవకాశాలు సృష్టించిన వారు - ఆడియన్స్ యే కారణం. ఇదే నేను ఎప్పుడు నమ్మే ఫిలాసఫీ.
* లూజర్ లో ఒలింపిక్ ని టార్గెట్ చేసే స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించారు - గన్ షూటింగ్ లో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా?
ఓ ట్రైనింగ్ ఏం తీసుకోలేదు - ఒక నిజమైన షూటర్ గన్ ఎలా పట్టుకుంటాడో అలానే పట్టుకోవడానికి - పట్టుకొని నటించడానికి కొంత ప్రాక్టీస్ చేశాను - నిజానికి ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక ఎమోషనల్ కంటెంట్ - డైరెక్టర్ అభి ఈ కథ ని చాలా అద్భుతంగా డీల్ చేశాడు.
* మీ లూజర్ కి సక్సెస్ రావాలని లూజర్ గా మీరు విన్నర్ అవ్వాలని మా తుపాకీ టీం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది
- ఆల్ ది బెస్ట్
థాంక్ యూ సో మచ్ - ఈ లాస్ట్ పంచ్ బావుంది - మీ తుపాకీ లో హెడ్ లైన్ లా చాలా స్ట్రైకింగ్ గా ఉంది - రీడర్స్ అందరు స్టే హోమ్ స్టే సేఫ్ - విష్ యూ ఆల్ గుడ్ లక్ - బై