నాగచైతన్య మిస్టరీ కథ.. హీరోయిన్స్ ట్విస్ట్?

ఈ సినిమాలో మొదట కథానాయికగా మీనాక్షి చౌదరిని అనుకున్నారు. ఆమెతో జోడీ కొత్తగా కనిపిస్తుందని, ఆమెను తీసుకోవాలని ప్లాన్ చేశారు.

Update: 2025-01-20 15:30 GMT

నాగచైతన్య తన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తండేల్ మూవీకి చివరి దశ షూటింగ్ జరుగుతోంది, ఇది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా తర్వాత, దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిథికల్ మిస్టరీ థ్రిల్లర్ కోసం చైతూ సరికొత్త క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. గతంలో విరూపాక్షతో ఆకట్టుకున్న కార్తీక్ దండు, మరో ఆసక్తికరమైన కథను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో మొదట కథానాయికగా మీనాక్షి చౌదరిని అనుకున్నారు. ఆమెతో జోడీ కొత్తగా కనిపిస్తుందని, ఆమెను తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ పారితోషికం విషయంలో సమస్యలు తలెత్తడంతో ఆమెను పక్కన పెట్టి శ్రీలీలను తీసుకోవాలని నిర్ణయించారని టాక్ వచ్చింది. శ్రీలీల లేటెస్ట్ హిట్‌లతో మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో కూడా ఆఫర్స్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.

కార్తీక్ దండు మెంటర్ గా ఉన్న సుకుమార్. గతంలో విరూపాక్షలో కూడా స్క్రిప్ట్ కోసం సహకరించాడు. ఈ కొత్త ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆయన సలహాలు ఇస్తున్నారు. పుష్ప 2 కోసం స్పెషల్ సాంగ్ లో నటించిన శ్రీలీల, ఆ సమయంలో చైతూ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ సలహాతో ప్రాజెక్ట్ లో ఛాన్స్ అందుకున్నట్లు కనిపించింది. శ్రీలీల నాగచైతన్య పక్కన బాగా సెట్టవుతుందని సుకుమార్ సలహా ఇవ్వడంతో, దాంతో నిర్మాతలు ఆమె వైపు మొగ్గుచూపారు.

అయితే, ఇప్పుడు శ్రీలీల డేట్ల సమస్య తలెత్తింది. ఆమె అఖిల్ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌ల డేట్లు క్లాష్ అవడంతో నిర్మాతలు మళ్లీ మొదట అనుకున్న మీనాక్షి వైపే చూస్తున్నారు. కానీ ఈ సమయంలో మీనాక్షి తన పారితోషికాన్ని పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి, అది సమస్యగా మారింది. ఎందుకంటే రీసెంట్ గా అమ్మడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సాలీడ్ సక్సెస్ అందుకుంది. గత ఏడాది వచ్చిన లక్కీ భాస్కర్ కూడా 100 కోట్లతో అమ్మడి స్థాయిని పెంచింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వస్తుండడంతో అమ్మడి రెమ్యునరేషన్ రేంజ్ గట్టిగానే పెరిగింది.

అందుకే మేకర్స్ కాస్త ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కు ముగింపు పెట్టి, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి నిర్మాతలు, హీరోయిన్ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే శ్రీలీల కోసం వేచి చూస్తారా లేదంటే మీనాక్షికి అడిగినంత ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. . చైతూ, కార్తీక్ దండు కాంబినేషన్‌తో మొదటిసారి తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News