మీనాక్షి స్కూల్‌ క్రష్‌.. అందుకే మీనూగా బాగా యాక్ట్‌!

మీనాక్షి చౌదరిని ఇప్పటి వరకు చూడని పాత్రలో చూపించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆమెను ప్రమోషన్‌ సమయంలోనూ విభిన్నంగానే చూపించాడు.

Update: 2025-01-20 14:30 GMT

సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్ టాక్‌ దక్కింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్‌ను వసూళ్లు చేసి రికార్డ్‌ బ్రేక్‌ చేసిన ఈ సినిమా లాంగ్‌ రన్‌లో మరెన్నో రికార్డ్‌లు బ్రేక్‌ చేయడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్స్ ఇద్దరు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఎంతగా సహకరించారో మనం చూశాం. దర్శకుడు అనిల్ రావిపూడి ఏది అనుకుంటే అది, ఎలా అనుకుంటే అలా ఇద్దరు హీరోయిన్స్ నటనతోనూ సినిమాలో అలరించారు. ఐశ్వర్య రాజేష్ చీర కట్టులో అలరిస్తే మీనాక్షి చౌదరి పోలీస్ ఆఫీసర్‌గా మంచి లుక్‌లో ఆకట్టుకుంది.

మీనాక్షి చౌదరిని ఇప్పటి వరకు చూడని పాత్రలో చూపించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆమెను ప్రమోషన్‌ సమయంలోనూ విభిన్నంగానే చూపించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తనకు స్కూల్‌ టైంలో టీచర్‌పై క్రష్ ఉండేదని చెప్పుకొచ్చింది. నేను ఒక్కదాన్ని మాత్రమే కాకుండా మా క్లాస్‌లో ఉన్న వారు అంతా ఆ సర్‌ గురించి మాట్లాడుకునే వాళ్లం. అమ్మాయిలందరికీ ఆయన మీద కన్ను ఉండేది. అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ట్రైనర్‌ అయిన వెంకటేష్ గారితో నేచురల్‌గా నటించాను అంది.

లవ్‌ సీన్స్‌లో యాక్టింగ్‌ బాగుంది అంటే ప్రేమలో పడాలి లేదా ప్రేమను అంతకు మించి ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండాలి అంటారు. స్కూల్‌ డేస్‌లో మీనాక్షికి టీచర్‌ క్రష్ కావడం వల్లే మీనూ పాత్రను అద్భుతంగా చేసింది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకుంది. ఇలాంటి విషయాలను సాధారణంగా హీరోయిన్స్ ఒప్పుకోరు. కానీ మీనాక్షి చౌదరి తన రహస్యాన్ని అందరి ముందు చెప్పేసింది. మీనాక్షి చౌదరి గత ఏడాది లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకుంది. ఇప్పుడు మరో విజయాన్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దక్కించుకుంది. గత సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చిన ఈ అమ్మడు ఈసారి సంక్రాంతికి గట్టి విజయాన్ని కొట్టింది.

దిల్‌ రాజు బ్యానర్‌లో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నవీన్‌ పొలిశెట్టితో ఈ అమ్మడు ఒక సినిమాను చేస్తుంది. అంతే కాకుండా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రెండు మూడు సినిమాలను ఈమె కమిట్‌ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. మరో వైపు దిల్‌ రాజు బ్యానర్‌లోనూ ఈమె ఒక సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తంగా రాబోయే ఏడాది కాలంలో ఈ అమ్మడి నుంచి మినిమం ఐదు సినిమాలు అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News