రకుల్‌కి బ్యాడ్ టైమ్... మళ్లీ నిరాశేనా
అర్జున్ కపూర్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నెకర్ హీరోయిన్‌లుగా రూపొందిన 'మేరే హస్బెండ్ కీ బివి' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి, పలువురు సూపర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆమె కంటే ముందు వచ్చిన వారు ఇంకా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా కొనసాగుతున్నారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అప్పుడే టాలీవుడ్ నుంచి కనిపించకుండా పోయింది. బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ హిట్ కొట్టి మళ్లీ టాలీవుడ్‌లో ఆఫర్లు సొంతం చేసుకోవాలని ఈ అమ్మడు ఆశ పడుతుంది. కానీ బాలీవుడ్‌లో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నా అవి సక్సెస్‌ను తెచ్చి పెట్టడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది.
అర్జున్ కపూర్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నెకర్ హీరోయిన్‌లుగా రూపొందిన 'మేరే హస్బెండ్ కీ బివి' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మొదటి నుంచే పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. విడుదల సమయంలోనూ మేకర్స్ పెద్దగా ప్రమోట్ చేయలేదు. దాంతో సినిమాకు ఓపెనింగ్ అంతగా రాదని ముందే ఊహించారు. అందుకే కొన్ని స్క్రీన్స్‌లో 1 ప్లస్ 1 ఆఫర్ ప్రకటించారు. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా ఇచ్చారు. అయినా టికెట్లు పెద్దగా అమ్మడు పోలేదు, అంతే కాకుండా ఆక్యుపెన్సీ పెద్దగా నమోదు కాలేదు. మొదటి రోజు వసూళ్లు అత్యంత దారుణంగా ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మేరే హస్బెండ్ కీ బివి సినిమాకు మొదటి రోజు కేవలం రూ.2 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. నేడు, రేపు వీకెండ్ కావడంతో వసూళ్లు కాస్త పుంజుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎంతగా పుంజుకున్నా సినిమా లాంగ్ రన్‌లో కనీసం రూ.20 కోట్లను నమోదు చేసే అవకాశాలు కనిపించడం లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రూ.50 కోట్లకు మించి ఖర్చు చేసి ఆ సినిమాను రూపొందించారు. కాని సినిమా ఫలితం చూస్తే డిజాస్టర్ తప్పేలా లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈమె పాత్రకు ప్రాముఖ్యత దక్కడంతో పాటు నటించేందుకు స్కోప్ దక్కిందట. కనుక సినిమా హిట్ అయితే బాలీవుడ్‌లో మరో మూడు నాలుగు ఆఫర్లు వస్తాయని ఆశ పడింది. కానీ రకుల్ ప్రీత్ సింగ్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లుగా ఉంది. అందుకే మరోసారి ఆమెకు ఈ సినిమాతోనూ నిరాశే మిగిలింది. రకుల్ సినీ కెరీర్ ఖతం అయిందా అంటూ అనుమానాలు వచ్చే విధంగా ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా ఫెయిల్ కావడంతో రకుల్ ప్రీత్ సింగ్ కి బాలీవుడ్‌లోనూ ఆఫర్లు మరింత కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.