య‌ష్ హీరో అవుతాడ‌ని పేరెంట్ కి న‌మ్మ‌కం లేదా?

Update: 2022-04-29 02:30 GMT
ఏ నోట విన్నా రాకింగ్ స్టార్ య‌ష్ గురించే. డార్లింగ్ ప్ర‌భాస్ త‌ర్వాత సౌతిండియాలో ఎక్కువ‌గా వినిపిస్తున్న పాన్ ఇండియా నేమ్ య‌ష్ మాత్ర‌మే. అత‌డు కేజీఎఫ్ రిలీజ‌య్యేంత వ‌ర‌కూ అంద‌రిలాగే ఒక సాధార‌ణ న‌టుడు. అంత‌కుమించి అత‌డు ఏదో సాధిస్తాడ‌ని ఎవ‌రూ అనుకోలేదు. కానీ అంతా అనూహ్యం.. ప్ర‌తిదీ ఓవ‌ర్ నైట్ మారిపోయింది.

ఒకే ఒక్క రాత్రిలో అత‌డు పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించాడు. ఇది కేజీఎఫ్ తెచ్చిన క్రేజ్. కేజీఎఫ్ 2 సంచ‌ల‌న విజ‌యంతో ఇప్పుడు అత‌డు దేశంలోనే టాప్ రేంజ్ హీరోగా వెలిగిపోతున్నాడు. షారూక్ న‌టించిన సినిమాని సౌత్ లో చూడ‌క‌పోవ‌చ్చు కానీ య‌ష్ న‌టించిన సినిమాని దేశం మొత్తం చూడ‌టానికి అభ్యంత‌రం లేదు.

అయితే య‌ష్ ఇంత పెద్ద స్టార్ అయినా కానీ.. KGF  స్టార్ గా తన వినయవిధేయ‌త‌లు ఒదిగి ఉండే స్వభావాన్ని ఎప్పుడూ విడిచిపెట్ట‌లేదు. అతడి గతాన్ని తెలుసుకోవాలనే తపించేవారి కోసం ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పాడు. నిజానికి య‌ష్ హీరో అవుతాడ‌ని అత‌డి త‌ల్లిదండ్రులు అస్స‌లు అనుకోలేదు.

తొలిగా తన తల్లిదండ్రుల అనుమ‌తి కోసం ప్ర‌య‌త్నించినా న‌మ్మ‌కం వ్య‌క్తం చేయ‌లేదు. ``వారు ఓకే అని అన్నారు. గరిష్టంగా ఒకటి లేదా రెండు రోజులు అతను అక్కడ ఉంటాడు.. లేదా ఒక వారంలోనే తిరిగి వెన‌క్కి ఇంటికి వ‌చ్చేస్తాడు. అతను జీవితం అంటే ఏమిటో గ్రహిస్తాడు`` అని అనుకున్నార‌ట‌. అయితే నాకు ఎప్పుడూ ప్లాన్ బి లేదు.. నేను ఎప్పుడూ నేనే హీరోనని అనుకున్నాను.

ఎందుకంటే చిన్నతనంలో నేను చాలా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవాడిని. నేను దానివ‌ల్ల అదనపు శ్రద్ధాస‌క్తుల‌ను సంపాదించాను. ప్రజలు చప్పట్లు  ఈలలు వేసేవారు. కాబట్టి నేను చాలా చిన్న వయస్సులోనే దానికి బానిస అయ్యాను అని కూడా తెలిపాడు.

కేజీఎఫ్ ముందు కేజీఎఫ్ త‌ర్వాత శాండ‌ల్వుడ్ ఎలా ఉంది? అని అడిగితే.. ``ఆ ఒక్క అడుగు చేయడం వల్ల మన పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. దేశంలోని ప్రతి ప్రాంతంలో ప్రజలు దీనిని స్వీకరించారు.. ఇది జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. మీ ఉత్పత్తిపై మీకు నమ్మకం ఉంటే మీరు బయటకు వెళ్లి అన్వేషించాలని నేను భావిస్తున్నాను`` అని అన్నారు.

మొత్తానికి శాండ‌ల్వుడ్ ని 1000 కోట్ల క్ల‌బ్ లో చేర్చిన ఘ‌న‌త య‌ష్ కే చెందుతుంది. వందేళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఇది అసాధార‌ణ ఫీట్ అని చెప్పాలి. బాహుబ‌లితో ప్ర‌భాస్ చరిత్ర‌ను తిర‌గ‌రాస్తే అత‌డిని అనుస‌రించ‌డంలో య‌ష్ స‌క్సెస‌య్యాడు. తెలుగు ప‌రిశ్ర‌మ క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌ల‌ను  ప్రాంతీయ ప‌రిశ్ర‌మ‌లు అని తీసిపారేసే వారికి స‌రైన జ‌వాబుగా నిలిచారు.  ప్ర‌భాస్‌- య‌ష్ ల‌ స‌క్సెస్ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ తో రామ్‌ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా రేస్ లోకి దూసుకొచ్చిన సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News