అతడిలా మిగతా హీరోలు బ్లాస్ట్ అయ్యేదెప్పుడు?
ఇటీవలే విశాల్ నటించిన `మదగజరాజా` విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇటీవలే విశాల్ నటించిన `మదగజరాజా` విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల క్రితం తీసిన సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం అందుకుంది. పొంగల్ కి పోటీగా మరే సినిమా కూడా లేకపోవడంతో ఈ సంక్రాంతి ని విశాల్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అన్నది రకరకాల కారణాలతో ఇంతకాలం డిలే అయింది. కానీ ఆలస్యమైనా? అద్భుతమైన విజయం అందుకుంది.
అయితే ఇలా ల్యాబ్ లో మగ్గిపోతున్న సినిమాలు ఇంకా కోలీవుడ్ మరికొన్ని ఉన్నాయి. 2013 లో సూర్య హీరోగా మొదలైన ప్రాజెక్ట్ అటుపై 2015 లో విక్రమ్ చేతికి వచ్చింది. ఆ సినిమా 2017లో షూటింగ్ మొదలై 2023 లో ముగించింది. దానికి దర్శకత్వం వహించింది గౌతమ్ మీనన్. అదే `ధృవనక్షత్రం`. ఈ సినిమా రిలీజ్ కోసం గౌతమ్ ఎన్ని ప్రయత్నాలో చేస్తున్నాడో? తెలిసిందే. ఆర్ధిక సమస్యలు కారణంగా ప్రాజెక్ట్ బయటకు రావడం లేదు.
సహాయం చేయండని ఎంత మొత్తుకున్నా? ఆ ప్రాజెక్ట్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ తేదీ ప్రకటించి వెనక్కి తీసుకున్నారు. అలాగే బాలీవుడ్ చిత్రం `క్వీన్` ని వివిధ భాషల్లో రీమేక్ మొదలైంది. కోలీవుడ్ లో `పారిస్` టైటిల్ తో మొదలైంది. ఇదే సినిమాలో వివిధ భాషల్లో ఒక్కో హీరోయిన్ మెయిన్ లీడ్ పోషించింది. తెలుగులో తమన్నా `దటీజ్ మహాలక్ష్మి`గా ప్రకటించారు. ఈ సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. షూటింగ్ పూర్తి చేసుకున్నా ఇప్పటికీ ల్యాబ్ లోనే ఉంది.
అలాగే వెంకట్ ప్రభు-జై కాంబోలో `పార్టీ` అనే సినిమా మొదలైంది. షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఇంకా విజయ్ సేతుపతి, విష్ణు విశాల్, ఐశ్వర్య రాజేష్ నటించిన `ఇదమ్ పోరుల్ యేవల్` షూటింగ్ పూర్తి చేసుకుని దశాబ్ధం దాటింది. ఈసినిమా కూడా ల్యాబ్ కే అంకితమైంది. `ఎందుకంటే ప్రేమంట` అనే సినిమా తెలుగు, తమిళ్ లో ఒకేసారి పట్టాలెక్కింది. తెలుగులో రిలీజ్ అయి డిజాస్టర్ అయ్యే సరికి తమిళ్ రిలీజ్ అపేసారు. ఇంకా అరవింద్ స్వామి నటించిన `నకరసూరన్`, సంతానం నటించిన `సర్వర్ సుందరం` కూడా అన్ని పనులు పూర్తి చేసుకున్నా రిలీజ్ కి నోచుకోలేదు. మరి దదగజరాజా స్పూర్తితో ఇవన్నీ ల్యాడ్ నుంచి..ఆన్ సెట్స్ నుంచి బయటకు వస్తాయేమో చూడాలి.