స్వీటీ ఆ విష‌యంలో ఇబ్బంది ప‌డుతోందా?

Update: 2023-02-14 18:27 GMT
క్రేజీ హీరోయిన్ లుగా పేరు తెచ్చుకుని పాపుల‌ర్ అయిన కొంత మంది వివిధ ర‌కాల రుగ్మ‌త‌ల‌తో బాధ‌ప‌డుతూ చివ‌రికి కోలుకుంటున్నారు. క్యాన్స‌ర్ బారిన ప‌డిన వాళ్లు కూడా కీమో థెర‌పీ ద్వారా తిరిగి చికిత్స పొందుతూ తిరిగి ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఇటీవ‌ల స‌మంత మ‌యోసైటీస్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతూ ప్ర‌త్యేక చికిత్స అనంత‌రం ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంది. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ లో న‌టిస్తూ త‌దుప‌రి ప్రాజెక్ట్ ల‌పై దృష్టి పెట్టింది.

ఇదిలా వుంటే ఈ మంగ‌ళ‌వారం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాను గ‌త కొంత కాలంగా తీవ్ర ఆనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని, ఆ విష‌యం మీ అంద‌రికి తెలియ‌జేయాల‌ని, త‌ద్వారా నాలా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారికి మాన‌సిక ధైర్యాన్ని క‌లిగించాల‌నే ఉద్దేశ్యంతో ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాన‌ని తెలిపి షాకిచ్చింది. రేణు దేశాయ్ గ‌త కొంత కాలంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ట‌.

ఇదిలా వుంటే స్వీటీ అనుష్క కూడా ఓ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ త‌మిళ మీడియాతో మాట్లాడుతూ అనుష్క ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌సారి న‌వ్వ‌డం స్టార్ట్ చేస్తే ఏక‌ధాటిగా 15 నుంచి 20 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా అనుష్క న‌వ్వుతుంద‌ట‌. ఇదే త‌న స‌మ‌స్య‌గా ఓ త‌మిళ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

న‌వ్వించే స‌న్నివేశం వ‌స్తే ప‌డి ప‌డి న‌వ్వుతూనే వుంటాన‌ని, తాను న‌వ్వ‌డం మొద‌లు పెడితే షూటింగ్ కు ప్యాక‌ప్ చెప్పాల్సిందేనని, ఏక‌ధాటిగా 15 నుంచి 20 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా న‌వ్వుతూనే వుంటాన‌ని, ఈ గ్యాప్ లో ప్రొడ‌క్ష‌న్ వాళ్లు టిఫిన్స్ , స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకుని వ‌స్తార‌ని అనుష్క వివ‌రించార‌ట‌. అయితే ఈ వార్త‌లు విన్న అనుష్క అభిమానులు మాత్రం న‌వ్వ‌డం ఆరోగ్యానికి మంచిదేగా స్వీటీ అంటూ కామెంట్ లు చేస్తున్నార‌ట‌.

ఇదిలా వుంటే `నిశ్శ‌బ్దం` త‌రువాత సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న అనుష్క ఆ త‌రువాత `జాతిర‌త్నాలు` ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి హీరోగా యువీ ప్రొడక్ష‌న్స్ వారు నిర్మిస్తున్న రొమాంటిక్ మూవీలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీకి `మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పొలిశెట్టి` అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News