వాటితో పోటీ...ఈసారైనా స‌త్తా చాటేనా?వాటితో పోటీ...ఈసారైనా స‌త్తా చాటేనా?

గోల్డెన్ గ్లోబ్ కి నామినేట్ అయినా అవార్డు వ‌రించలేదు. నామినేష‌న్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

Update: 2025-01-16 19:30 GMT

భార‌తీయ ద‌ర్శ‌కురాలు పాయ‌ల్ క‌పాడియా తెర‌కెక్కించిన‌ 'ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌' చిత్రం ఇప్ప‌టికే ప‌లు అంతర్జాతీయ ఫిలిం పెస్టివ‌ల్స్ లో స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్ కి నామినేట్ అయినా అవార్డు వ‌రించలేదు. నామినేష‌న్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. తాజాగా పాప్టా (బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) అవార్డులకు కూడా నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఉత్త‌మ ద‌ర్శ‌కుడి విభాగంతో పాటు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ఫిల్మ్‌ నాట్‌ ఇన్‌ ఇంగ్లీష్ విభాగాల్లో నామినేట్ అయ్యింది. విజేత‌ల జాబితా ఈనెల 15 వెల్ల‌డి కానుంది. అయితే ఇప్పుడీ చిత్రం 'ఎమిలియా పెరెజ్', 'ఐ యామ్ స్టిల్ హియర్', 'నీక్యాప్' , 'ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్' వంటి చిత్రాల‌తో పోటీ ప‌డుతుంది. వాటిని త‌ల‌ద‌న్ని బాప్టాలో విజ‌య కేత‌నం ఎగ‌ర‌వేయాలి.

అదంత సుల‌భం కాదు. ఈ హాలీవుడ్ చిత్రాలు ఇప్ప‌టికే ప‌లు అంతార్జ‌తీయ అవార్డుల‌తో స‌త్తా చాటాయి. వ‌ర‌ల్డ్ వైడ్ గా గొప్ప ప్రాచుర్యం పొందిన చిత్రాలుగా పేరుగాంచాయి. కానీ ఆల్ వి ఇమేజిన్ యాజ్లైట్ సినిమాకు ఇండియా లోనే స‌రైన గుర్తింపు గానీ, గౌర‌వం ద‌క్క‌లేదు. అంత‌ర్జాతీయంగా స‌త్తా చాటే ప్ర‌తిభ ఉన్నా? స్థానికంగా నెగ్గించ‌లేక పోతున్నామ‌ని ప‌లువురు హీరోలు ఇప్ప‌టికే అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.

ఇలాంటి చిత్రాలు ఓటీటీ రిలీజ్ అయితేనే ఇండియా స‌హా వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌న‌మ‌వుతున్నాయి. థియేటర్ రిలీజ్ ప‌రంగా నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే ముంబై న‌ర్సింగ్ హోమ్ లో ప‌నిచేసే కేర‌ళ‌కు చెందిన ఇద్ద‌రు న‌ర్సుల క‌థ ఆధారంగా తెర‌కెక్కించారు. గ‌తేడాది జ‌రిగిన ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సినిమా చూసి ప్ర‌శంస‌లు కురిపించారు.

Tags:    

Similar News