టాలీవుడ్ లో బ్రదర్స్ కాంబినేషన్ సాధ్యమేనా?
టాలీవుడ్ లో చేతులు కలపాల్సిన కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. కానీ ఎందుకనో ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు.
టాలీవుడ్ లో చేతులు కలపాల్సిన కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. కానీ ఎందుకనో ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఇమేజ్ పరంగా చూస్తే సరితూగవు గానీ... ఆ కాంబినేషన్ లో సినిమాలోస్తే బాగుండని అభిమానులు మాత్రం బలంగా కోరుకుంటున్నారు. ఓసారి ఆ కాంబినేషన్ లోకి వెళ్తే....యంగ్ టైగర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు అంటున్నారు.
వాళ్లిద్దరు ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అంతకుమించిన గొప్ప అన్నాదమ్ముల అనుబంధం ఇద్దరి మధ్య ఉంది. నిజంగా సొంత అన్నదమ్ములు కూడా అలా ఉండరు. టాలీవుడ్ లో అంత గొప్ప అన్నదమ్ములు తారక్-కల్యాణ్. తారక్ పాన్ ఇండియా స్టార్. కళ్యాణ్ రామ్ రీజనల్ స్టార్. తమ్ముడితో అన్నయ్య కలిసి నటిస్తే? కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం పెద్ద విషేశమా? అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అల్లు శిరీష్ కూడా కలిసి నటించాల్సిన కాంబోనే.
బన్నీ పెద్ద పాన్ ఇండియా స్టార్. తమ్ముడు ఇంకా రీజనల్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాంటి శిరీష్ తో బన్నీఓ సినిమా చేస్తే రీజనల్ ఇమేజ్ తో పాటు పాన్ ఇండియా లోనూ ఫేమస్ అయిపోతాడు. ఇక మెగా బ్రదర్స్ రామ్ చరణ్- వరుణ్ తేజ్ కూడా కలిసి నటించాల్సిన అవసరం ఉంది. చరణ్ పాన్ ఇండియా స్టార్ కాగా వరుణ్ ఆ ఇమేజ్ కి ప్రయత్నిస్తున్నాడు.
ఇలాంటి సమయంలో చరణ్ తమ్ముడితో నటిస్తే వరుణ్ కి బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. ఇక మెగా మేనల్లుడు...అన్నదమ్ములు సాయిదుర్గతేజ్-వైష్ణవ్ తేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటులుగా ఇద్దరు ఇప్పటిక సక్సెస్ అయ్యారు. వాళ్లను కలిస్తే వెండి తెరపై చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ అన్నదమ్ములంతా తలుచుకుంటే చేతులు కలపడం పెద్ద విషయం కాదు.