సైఫ్ కేర్ టేక‌ర్‌పై దాడి, కోటి డిమాండ్.. నిందితుడి ఫోటో ఇదే!

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను బాంద్రాలోని తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి అనేకసార్లు క‌త్తితో పొడిచాడు.

Update: 2025-01-16 18:57 GMT

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను బాంద్రాలోని తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి అనేకసార్లు క‌త్తితో పొడిచాడు. తీవ్ర గాయాల‌తో లీలావ‌తి ఆస్ప‌త్రిలో చేరిన సైఫ్‌ను శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు. గురువారం నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ ఘ‌ట‌న‌పై విచారించ‌గా ప‌లు షాకిచ్చే విష‌యాలు తెలిసాయి. దుండ‌గుడు మొద‌ట సైఫ్ కుమారుడు జేహ్ రూమ్ లోకి ప్ర‌వేశించాడు. అక్క‌డ కేర్ టేక‌ర్ గా ఉన్న యువ‌తి అత‌డిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ అత‌డు ఆమెపై దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో వెంట‌నే ఆమె పెద్ద‌గా కేక‌లు పెట్టింది. ఇంట్లో వేరే రూమ్ నుంచి అక్క‌డికి వచ్చిన సైఫ్ ఖాన్, క‌రీనా క‌పూర్ అత‌డిని ఆపే ప్ర‌య‌త్నం చేసారు. కానీ ఇంత‌లోనే అత‌డు సైఫ్ పై క‌త్తితో దాడి చేసాడు. విచ‌క్ష‌ణా ర‌హితంగా క‌త్తిపోట్లు పొడిచి పారిపోయాడు.

ప్ర‌స్తుతం పోలీస్ విచార‌ణ‌లో కేర్ టేక‌ర్ ప‌లు ఆశ్చ‌ర్య‌పోయే విష‌యాలు తెలిపారు. సైఫ్ అలీఖాన్ ను పొడిచిన దుండగుడు అంత‌కుముందు కేర్ టేకర్ పై దాడి చేసి రూ.1 కోటి ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి మొదట్లో డబ్బు కోసం తనను బెదిరించి, మిగిలిన కుటుంబ సభ్యులను ఎలా టార్గెట్ చేసాడో వివరించింది.

తాను గొడవ చేసాన‌ని ఆ స‌మ‌యంలో సైఫ్, కరీనా సహాయం కోసం పరుగెత్తానని కేర్ టేకర్ చెప్పింది. సైఫ్ ఆ దుండ‌గుడిని ప్ర‌శ్నించారు. ఎవ‌రు నీవు? ఏం కావాలి? అని ప్ర‌శ్నించాడు. ఆ వ్యక్తి సైఫ్ పై చెక్క వస్తువు , హెక్సా బ్లేడుతో దాడి చేశాడు. కరీనా గదిలోకి ప్రవేశించినప్పుడు దుండగుడు ఆమెకు కూడా హాని కలిగించడానికి ప్రయత్నించాడు. వారంతా తప్పించుకుని తలుపు లాక్ చేసుకున్నారు... అని తెలిపాడు. శబ్దం విని సైఫ్‌ సిబ్బంది లో రమేష్, హరి, రాము, పాస్వాన్ మేల్కొని వారికి సహాయం చేయడానికి వచ్చారు. వారంతా గొడ‌వ జ‌రిగిన గది వ‌ద్ద‌కు వచ్చినప్పుడు తలుపు తెరిచి ఉండటం చూశారు.

ఈ ఘర్షణలో సైఫ్ మెడ వెనుక, కుడి భుజం దగ్గర, వీపు ఎడమ వైపు, ఎడమ మణికట్టు , మోచేయిపై గాయాలయ్యాయి. ఈ గాయాల నుండి రక్తం కారుతోంది. అతడి కుడి మణికట్టు, వీపు, ముఖంపై కూడా గాయాలయ్యాయి. చొరబాటుదారుడికి దాదాపు 35 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అతడు ముదురు రంగుతో సన్నగా ఉన్నాడు. ముదురు రంగు దుస్తులు ధరించి తలపై టోపీ పెట్టుకున్నాడు.

అస‌లేం జ‌రిగింది?

గురువారం తెల్లవారుజామున ముంబైలోని తన నివాసంలో జరిగిన చోరీ ప్రయత్నంలో ఒక ఆగంతకుడు కత్తితో దాడి చేయగా.. తాజాగా సీసీ టీవీ ఫుటేజ్ లో అత‌డి ఫోటో ఆధారం ల‌భించింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సత్గురు శరణ్ భవనంలోని సైఫ్‌ 12వ అంతస్తు ఫ్లాట్‌లోకి చొరబడిన దుండగుడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించలేదు కానీ అత‌డు... అర్థ‌ రాత్రి ఏదో ఒక సమయంలో చొరబడి ఉండవచ్చని భావిస్తున్నారు.

తెల్లవారుజామున 2.30 గంటలకు సంఘటన జ‌రిగిన‌ తర్వాత ఆ దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు. సైఫ్‌కు 6 గాయాలు, 2 మైనర్, 2 ఇంటర్మీడియట్, మ‌రో 2 పెద్ద‌ గాయాలు అయ్యాయి. ఒక గాయం వెన్నెముకకు దగ్గరగా ఉన్న వీపుపై ఉంది. శస్త్రచికిత్సలో న్యూరో సర్జన్ పాల్గొన్నార‌ని లీలావతి హాస్పిటల్ సీవోవో డాక్టర్ ఉత్తమని అన్నారు.

సైఫ్ వైద్య ప్రక్రియ తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వెల్ల‌డించారు. సైప్ శ‌రీరం నుంచి విరిగిన‌ కత్తి ముక్క‌ను కూడా తొలగించారు. అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వైద్యులు అతడి ఆరోగ్యంపై పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

చోరీ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడని డిసిపి దీక్షిత్ గెడమ్ ధృవీకరించారు. ఈ సంఘటన తర్వాత ముంబైలో సెల‌బ్రిటీల‌ భద్రత గురించి చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. దాడి తీవ్రమైన సంఘటన అని, కానీ దాని కారణంగా ముంబైని సురక్షితం కాదని పిలవడం తప్పు అని ఫడ్నవీస్ అన్నారు. ఈ దాడిని ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ అన్నారు.

Tags:    

Similar News