వైరల్: కూతుళ్ళతో విశ్వసుందరి డ్యాన్స్

Update: 2018-10-18 05:53 GMT
మాజీ విశ్వసుందరి సుష్మిత సేన్ రూటే సెపరేటు.  తన భావాలను సూటిగా వ్యక్తీకరించడం దగ్గరనుండి మొదలు పెడితే.. పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకోవడం..  ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని అమ్మ-నాన్న తనే అయ్యి సింగిల్ మదర్ గా పెంచడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

సుష్మిత తాజాగా ఇద్దరు కూతుళ్ళతో కలిసి దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొంది. ముంబైలో బాలీవుడ్ సెలెబ్రిటీల ఇళ్ళకు కేరాఫ్ అడ్రెస్ అయిన బాంద్రా ఏరియాలో దుర్గాపూజా మండపాన్ని ప్రతి ఏడాది లాగానే ఏర్పాటు చేశారు.  అక్కడకు ఇద్దరు కూతుళ్ళు రెనీ- అలిసా తో హాజరైన సుష్మిత పూజలు జరపడమే కాకుండా ట్రెడిషనల్ ధునుంచి డ్యాన్సు  వేసింది. 

ఇద్దరు కూతుళ్ళ తో కలిసి సుష్మిత చేసిన డ్యాన్సు వీడియో ను తన సోషల్ మీడియా లో షేర్ చేసి "నా బేబీస్ తో కలిసి డాన్స్ చేయడం ఒక డివైన్ ఫీలింగ్. ఇ క్కడి అగర్బత్తులు తమ సుగంధమైన పాజిటివిటి.. ప్రేమ.. నమ్మకం.. కరుణ లను అన్ని చోట్లకీ తీసుకెళ్ళాలి" అని క్యాప్షన్ పెట్టింది.  ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది.  మీరు కూడా ఆ వీడియోపై ఒక లుక్కేయండి. 

Video : https://www.instagram.com/p/BpBGuxsHZ5O/?taken-by=sushmitasen47
Tags:    

Similar News