మాజీ తెలుగు నటి, మాండ లోక్ సభ సభ్యురాలు సుమలతకు కరోనా సోకింది. ఎంపీగా కరోనా సమయంలో కూడా ఆమె ప్రజల్లో తిరిగారు. సహాయ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలకు అవగాహన కల్పించడం చేసేవారు. ఈ క్రమంలో తాజగా ఆమెకు కొన్ని కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అనుమానంతో ఆమెకు పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.
శనివారం నుంచి ఆమెకు లక్షణాలు కనిపించాయి. పరీక్షల అనంతరం ఆమె హోంఐసోలేషన్లో ఉన్నారు. లక్షణాలు స్వల్పంగా ఉండంతో ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు సన్నిహితులు వెల్లడించారు. వైద్యుల సలహాలతో ఇంటి నుంచే చికిత్స తీసుకుంటున్నారు.
సుమలత ఒకప్పుడు తెలుగులో పెద్ద తార. చిరంజీవితో సహా పలువురు టాప్ హీరోల సరసన నటించారు. దక్షిణ భారతంలో అన్ని భాషల్లో నటించారు. జీతెలుగు బతుకు జట్కా బండి కార్యక్రమం కూడా చేశారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి ఆమె పార్లమెంట్‌లో అడుగుపెట్టడం విశేషం.