అఖిల్ కాబోయే సతీమణి నేపథ్యం?
అయితే మనకు అందిన క్లుప్త సమాచారం మేరకు... జైనాబ్ రావ్ జీ ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. జైనాబ్ రావ్జీ మూడు దేశాల్లో తన ప్రతిభతో మెరుస్తున్నారు.
డిసెంబర్ 4న నాగ చైతన్య- శోభిత జంట పెళ్లి జరుగుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. అక్కినేని కుటుంబం నుంచి మరో సంతోషకరమైన ప్రకటన అభిమానులు సహా తెలుగు ప్రజలను థ్రిల్ చేసింది. అఖిల్ నిశ్చితార్థం గురించిన ఆకస్మిక ప్రకటన వైరల్ గా మారింది. అతడు జైనాబ్ అనే అందమైన అమ్మాయిని పెళ్లాడుతున్నాడు.
అఖిల్ అక్కినేని కాబోయే భార్య జైనాబ్ రావ్ జీ ఇంతకీ ఎవరు? తన స్వస్థలం ఎక్కడ? నేపథ్యం ఏమిటి? కుటుంబ వివరాలు ఏమిటీ? ప్రస్తుతం గూగుల్ సెర్చ్ లో తుఫాన్‌గా మారిన అంశమిది. జైనాబ్ అనే పేరు వినగానే హైదరాబాదీ అమ్మాయా? లేక ఏదైనా ఇతర మెట్రో నగరం నుంచి వచ్చిందా? అంటూ ఒకటే ఆరాలు.. గూగుల్ ని వేడెక్కించాయి.
అయితే మనకు అందిన క్లుప్త సమాచారం మేరకు... జైనాబ్ రావ్ జీ ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. జైనాబ్ రావ్జీ మూడు దేశాల్లో తన ప్రతిభతో మెరుస్తున్నారు. భారతదేశం, దుబాయ్, లండన్‌లో తనదైన ముద్ర వేస్తూ ఇన్ ఫ్లూయెన్సర్ గా, నటిగా పేరు ఘడించారు. రెండేళ్ల క్రితం అఖిల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు నిశ్చితార్థం అయింది. త్వరలో ఈ జంట పెళ్లి జరగనుంది. జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్ జీకి నాగార్జునతో చిరకాల స్నేహం ఉందని కూడా తెలిసింది.
అఖిల్ ప్రస్తుతం రెండు సినిమాలకు సంతకాలు చేసాడు. గత ఏడాది ఏజెంట్ మూవీ నిరాశపరిచిన తర్వాత సెలక్టివ్ గా ముందుకు వెళుతున్నాడు. డిసెంబర్ 31 లేదా కొత్త సంవత్సరంలో తన సినిమాల గురించిన అప్ డేట్స్ అందిస్తాడని అంతా భావిస్తున్నారు. ఇంతలోనే తన పెళ్లి గురించిన వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది.