రాజా సాబ్.. మాళవిక అందుకే చేస్తుందట!
కానీ రాజా సాబ్ లో మాత్రం తన రోల్ ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటుందని.. అందుకే చేస్తున్నట్లు పేర్కొంది మాళవిక.
కేరళ కుట్టి మాళవిక మోహనన్ గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వేట మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. రెండో సినిమా దళపతి విజయ్ తో చేసే ఛాన్స్ కొట్టేసింది. లోకేష్ కనగరాజ్ తీసిన మాస్టర్ మూవీతో చారు పాత్రలో నటించి అందరినీ ఓ రేంజ్ లో మెప్పించింది.
ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిన మాళవిక.. యుద్ధ సహా వివిధ సినిమాల్లో యాక్ట్ చేసి ఆకట్టుకుందనే చెప్పాలి. రీసెంట్ గా పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ మూవీతో కోలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మాళవిక.. ఆదివాసీ మహిళ ఆరతి రోల్ లో నటించి ఆకట్టుకుంది. సింపుల్ గా చెప్పాలంటే అదరగొట్టేసింది.
ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది మాళవిక. కోలీవుడ్ లో కార్తీ సర్దార్ లో నటిస్తోంది. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. మాలీవుడ్ లో మోహన్ లాల్ మూవీలో నటించనుంది. ఇప్పుడు తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ లో యాక్ట్ చేస్తోంది.
కామెడీ అండ్ హారర్ జోనర్ లో మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా మూవీ షూటింగ్ జరుగుతుండగా.. 2025లోనే రిలీజ్ కానుంది. అయితే సినిమాలో మాళవిక మోహనన్.. ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే మాళవిక రాజా సాబ్ చేయడానికి గల కారణాన్ని రీసెంట్ గా వివరించింది. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న రాజా సాబ్ స్పెషల్ మూవీ అని చెప్పిన ఆమె.. సినిమా అంతా తన రోల్ ఉంటుందని చెప్పింది. నార్మల్ గా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉంటుందని అనింది.
కానీ రాజా సాబ్ లో మాత్రం తన రోల్ ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటుందని.. అందుకే చేస్తున్నట్లు పేర్కొంది మాళవిక. అదే సమయంలో సినిమాపై మంచి హోప్స్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సూపర్ హిట్ ను అందుకునేందుకు సిద్ధంగా ఉందట. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఆ సినిమా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో.. మాళవిక ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.