తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు ఉండడంతో.. పరీక్ష చేయించుకోగా తనకు పాజిటివ్ వచ్చిందని స్వయంగా కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ లో పోస్టు చేశారు.
తాను మైల్డ్ కరోనాతో బాధపడుతున్నట్టు వివరించారు కేటీఆర్. దీంతో.. ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి సైతం ట్వీట్ చేశారు.
‘ప్రియమైన కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ చిరు ట్వీట్ చేశారు. మెగాస్టార్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే సీఎం కేసీఆర్ కొవిడ్ బారిన పడి, చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. దేశంలో కొవిడ్ విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో సుమారు 3 లక్షల 33 వేల కేసులు నమోదయ్యాయి. 2, 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు రాష్ట్రంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోజుకు 5 నుంచి 6 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.