సూప‌ర్ ఉమెన్ 2.0 మ‌ళ్లీ బ‌రిలో దిగుతోందా?

Update: 2020-09-01 14:00 GMT
లండ‌న్ బ్యూటీ ఎమీ జాక్స‌న్ త‌మిళ హీరో ఆర్య న‌టించిన `మ‌ద‌రాసి ప‌ట్ట‌ణం` చిత్రంతో బ్రిటీష్ న‌టిగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. అందం అభిన‌యంతో ఆక‌ట్టుకోవ‌డంతో ఈ భామ‌పై ప‌లువురు ద‌ర్శ‌కులు క‌న్నేశారు. బాలీవుడ్ కూడా ఆస‌క్తి చూపించింది. ఇక ఇండియ‌న్ జేమ్స్ కామెరూన్ ‌గా పిలుచుకునే ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కూడా ఈ భామ‌పై మ‌న‌సు ప‌డ్డారు. బ్యాక్ టు బ్యాక్ త‌న చిత్రాల్లో అవ‌కాశం ఇచ్చారు.

విక్రమ్ ‌తో ప్ర‌యోగాత్మ‌క చిత్రం `ఐ`తో పాటు త‌మిళ సూప‌ర్‌స్టార్ త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్ ‌తో చేసిన 2.O చిత్రాల్లో ఎమీ మెరిసింది. 2.Oలో సూప‌ర్ రోబోగా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. లండ‌న్ కి చెందిన‌ బిజినెస్ ‌మెన్ జార్జ్ పనయోటౌని 2019 జ‌న‌వ‌రి 1న వివాహం చేసుకున్న ఎమీ ఆ త‌రువాత ప్రెగ్నెంట్ కావ‌డంతో రెండేళ్లుగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తోంది. సెప్టెంబ‌ర్ లో ఆండ్రియాస్ కు జ‌న్మ‌నిచ్చిన ఎమీ జాక్స‌న్ నిత్యం బుల్లి రోబోని వెంట‌పెట్టుకు తిరుగుతూ సోష‌ల్ మీడియాలో ఆ ఫొటోల‌ని షేర్ చేస్తూ అభిమానుల‌తో పంచుకుంటూ వ‌చ్చింది.

అయితే ఇండియాలో ఎమీ కెరీర్ సంగ‌తేంటి? సౌత్‌.. నార్త్ చిత్రాల్లో ఆమె న‌టించి చాలా కాల‌మే అయ్యింది. 2.O త‌ర్వాత క‌నిపించ‌లేదు. . ఇప్పుడేం చేస్తోంది. బిడ్డ పుట్టాక.. ఇండియాన్ చిత్రాల్లో పూర్తిగా క‌నిపించ‌కుండా పోయింది. ఇంత‌కీ చిట్టిక‌న్న‌య్య 2.O ఏడీ? ఎమీ ఒడిలో క‌నిపించ‌డేం?. అని ఆమె అభిమానులు నెటిజ‌న్స్ ఆరా తీస్తు‌న్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందు సూప‌ర్ గ‌ర్ల్ గా ఓ టీవీ సిరీస్‌లో న‌టించి అద‌ర‌గొట్టిన ఎమీ ప్ర‌స్తుతం ఓ అమెరిక‌న్ సూప‌ర్‌మెన్ సిరీస్ ని అంగీక‌రించింద‌ని అందులో సూప‌ర్ గర్ల్ ‌గా క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. తాజా‌గా సెట్ లో మేక‌ప్ వేసుకుంటున్న ఫొటోల‌ని ఎమీ అభిమానుల కోసం షేర్ చేసింది. ఇది క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న కోస‌మా లేక సిరీస్ లో న‌టిస్తూ చేసిన సెట‌ప్పా? అన్న‌ది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News