తమిళనాడులో ఏ హీరో అంటే ఫ్యాన్స్ పడిచస్తారు? ఎవరంటే ఎక్కువ అభిమానం చూపిస్తారు? అనే ప్రశ్న వేస్తే.. ఎవరైనా సరే టక్కుమని సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు చెప్పేస్తారు. కానీ ఇప్పుడది కరెక్ట్ కాదు. ఏ హీరోని తమిళులు ఎక్కువ అభిమానిస్తారు అనే సర్వే చేస్తే.. వచ్చిన రిజల్ట్ అందరికీ షాక్ గా మారింది.
ప్రొఫెసర్ రాజనాయగం ఆధ్వర్యంలో పీపుల్స్ స్టడీస్ అనే సంస్థ తాజాగా తమిళుల అభిమానంపై ఓ సర్వే చేసి రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో రజినీకాంత్ అంటూ 15.9 శాతం ఓటేశారు. ఈ ఓటింగ్ తో రజినీ స్థానం రెండుకు పరిమితం అయిపోయింది. అందరి కంటే ఎక్కువగా అజిత్ కు 16శాతం మంది ఓటేయడం విశేషం. రజినీకాంత్ కంటే ఎక్కువమంది అభిమానంతో అజిత్ తొలి స్థానాన్ని సగర్వంగా అందుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు 9.2 శాతం మంది మద్దతు లివగా కమల్ హాసన్ ను ఫ్యావరేట్ యాక్టర్ గా 5.9శాతం మంది చెప్పారు. 4.3 శాతం ఓటింగ్ మాత్రమే సూర్యకు పడ్డంతో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు.
కేవలం సినిమాలపైనే కాకుండా రాజకీయాల పైనే సర్వే చేసింది పీపుల్స్ స్టడీస్. రాబోయే ఎన్నికల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఓటేయబోతున్నట్లు 33.3శాతం మంది చెప్పగా, కరుణానిధి వెనక 33.1 శాతం నిలిచారు. రాజకీయాల విషయంలో ఈ రిజల్ట్ పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా.. రజినీకాంత్ కంటే అజిత్ కు అభిమానులు ఎక్కువగా ఉండడం మాత్రం విశేషమే.