యూఎస్ఏ లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. మన సినిమాలు అక్కడ భారీ స్థాయిలో విడుదలై మిలియన్ డాలర్లు వసూలు చేస్తుంటాయి. అయితే కరోనా వైరస్ రాకతో ఓవర్ సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత 'లవ్ స్టోరీ' సినిమా యూఎస్ థియేటర్లలో ప్రభావం చూపగలిగింది.
ప్రీమియర్స్ ద్వారా 313K డాలర్లు కలెక్ట్ చేసిన 'లవ్ స్టొరీ' అక్కడ మిలియన్ కు పైగా వసూలు చేసింది. ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అయి, ఓవర్ సీస్ మార్కెట్ కు ఊపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా కూడా 500K డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి యూఎస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇప్పుడు అందరి చూపు 'అఖండ' సినిమా మీదే ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో 'అఖండ' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇది. ట్రేడ్ లో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. డిసెంబర్ 2న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్.. డిసెంబర్ 1వ తేదీన ప్రదర్శించబడతాయి.
యూఎస్ఏ లో సాధారణంగా మాస్ యాక్షన్ సినిమాలకు ఆదరణ తక్కువగానే ఉంటుంది. అయితే 'అఖండ' సినిమా ప్రీ బుకింగ్ సేల్స్ ఆశాజనకంగా జరుగుతుందటంతో బాలయ్య మూవీ ప్రీమియర్స్ తోనే మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రీ సేల్స్ 150K డాలర్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. లాంగ్ వీకెండ్ కావడం వల్ల మిగిలిన మూడు రోజుల బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉండొచ్చు.
కరోనా పాండమిక్ తర్వాత యూఎస్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన 'లవ్ స్టొరీ' చిత్రాన్ని ''అఖండ'' చిత్రాన్ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అంతేకాదు బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చిన 'లెజెండ్' ప్రీమియర్స్ ను బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.
కాగా, 'అఖండ' చిత్రాన్ని సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ - జగపతిబాబు - పూర్ణ కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.