కొన్నాళ్ల క్రితం ఐస్ బకెట్ ఛాలెంజ్ బాగా వైరల్ అయింది. సెలబ్రిటీలంతా పోటాపోటీగా ఈ ఛాలెంజ్ స్వీకరించారు. లేటెస్ట్ గా ఒలింపిక్ మెడల్ విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఓ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ హ్యాష్ ట్యాగ్ తో తాను పుషప్స్ చేస్తూ ఫిటెనెస్ ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నానో నెరేట్ చేశారు. ఈ ఛాలెంజ్ కు మొదట నామినేట్ చేసిన వాళ్లలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఉన్నాడు.
హృతిక్ కూడా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి తాను ఫిట్ నెస్ ఎలా మెయిన్ టెయిన్ చేస్తాడో చెప్పుకొచ్చాడు. అలా అలా.. ఆ ఛాలెంజ్ ఇప్పుడు అక్కినేని అఖిల్ దాకా వచ్చింది. జిమ్ లో తాను ఏ రేంజిలో వర్కవుట్స్ చేస్తానో వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు. బాడీ పక్కాగా ఫిట్ ఉండటానికి అఖిల్ చేసే వర్కవుట్స్ చాలా హెవీగానే ఉన్నాయి. అంతటితో సరిపెట్టకుండా ఈ ఛాలెంజ్ కు మరో నలుగురిని నామినేట్ చేశాడు. వాళ్లలో ఇద్దరు అక్కినేని ఫ్యామిలీలోనే ఉండటం విశేషం.
అఖిల్ నామినేట్ చేసిన వారిలో తన అన్న నాగచైతన్య.. తండ్రి నాగార్జున ఉన్నారు. వీళ్లు కాకుండా మహానటితో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లను కూడా అఖిల్ నామినేట్ చేసిన వారిలో ఉన్నారు. అఖిల్ కు బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ఈ ఛాలెంజ్ ఇచ్చింది.