అక్కినేని మిసైల్ అఖిల్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `మిస్టర్ మజ్ను` ఆన్‌సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అఖిల్ సరసన `సవ్యాసాచి` ఫేం నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. `తొలి ప్రేమ` ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గానే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిల్ రోమియో లుక్ ఫెంటాస్టిక్ అంటూ అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. బ్యాలెన్స్ షూట్ వేగంగా పూర్తి చేసి - రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ తేదీ ఎప్పుడు అన్నది ఇప్పటికీ ఓ కన్ఫ్యూజన్. అయితే కన్ఫ్యూజన్ లోంచి పుట్టుకొచ్చిన ఓ ఐడియా సరైన దారి చూపించిందన్న మాటా అక్కినేని కాంపౌండ్ లో వినిపిస్తోంది.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావించారు. కింగ్ నాగార్జునకు ఉన్న డిసెంబర్ సెంటిమెంట్ వర్కవుటవుతుందని అనుకున్నా ఎందుకనో కుదరలేదు. సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాల్సిందిగా కొందరి నుంచి ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే 2019 సంక్రాంతికి ఠఫ్ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. నటసింహా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `ఎన్టీఆర్ - కథానాయకుడు` సంక్రాంతి కానుకగా రిలీజవుతోంది. రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ మూవీ ఆర్‌సి 12 (స్టేట్ రౌడీ వర్కింగ్ టైటిల్) - విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ - అనీల్ రావిపూడి చిత్రం `ఎఫ్ 2- ఫన్ & ఫ్రస్టేషన్` ఇదే సీజన్ కి రిలీజవుతున్నాయి. వీటితో పాటు తమిళం నుంచి తళా అజిత్ `విశ్వాసం` సంక్రాంతి బరిలోనే రిలీజ్ కి రానుంది.
దీంతో అఖిల్ బృందం మరోసారి పునరాలోచించుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న రిలీజ్ చేస్తే బావుంటుందని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇప్పుడు అది కూడా సాధ్యపడదన్న మాట వినిపిస్తోంది. అప్పటికి `ఎన్టీఆర్ - మహానాయకుడు` (పార్ట్ 2) రేస్ లోకి వస్తోంది. 24 జనవరి రిలీజ్ తేదీని ఫిక్స్ చేశారు కాబట్టి, పోటీ అన్నదే లేకుండా `మిస్టర్ మజ్ను`ను రిలీజ్ చేయడం కుదరని సన్నివేశం ఎదురైంది. అందుకే వీటన్నిటికీ చెక్ పెట్టేస్తూ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ని రిలీజ్ చేస్తే యాప్ట్ గా ఉంటుందని అఖిల్ - వెంకీ- బివిఎస్ ఎన్ బృందం భావిస్తున్నారట. ఒకవేళ ఈ తేదీ లాక్ చేసి ఉంటే అదే సరైన నిర్ణయం అన్న మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా అక్కినేని బ్రాండ్ తో వస్తోంది. అఖిల్ రోమియోగా నటించాడు కాబట్టి సరైన టైమింగ్ కలిసి రావాలి. అది ప్రేమికులరోజు అయితేనే బావుంటుందన్న వాదనా అక్కినేని అభిమానుల్లో వినిపిస్తోంది. మరి చిత్రయూనిట్ అధికారికంగా దీనిపై ప్రకటిస్తుందేమో కాస్త వేచి చూడాలి.