అక్కినేని వారింట రెండు పెళ్లి వేడుకలు అని తెలిసేసరికి అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేశారు. ఇక అసలు సిసలు సందడికి తెరతీసినట్టే అని భావించారు. ఇద్దరు హీరోల పెళ్లి వేడుకల్నీ కనులారా చూసి ఆస్వాదిద్దామని ప్లాన్ చేసుకున్నారు. మొదట అఖిల్ పెళ్లి జరుగుతుందని - ఆ తర్వాతే నాగచైతన్య పెళ్లి అని అక్కినేని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాంతో అభిమానులు అఖిల్ పెళ్లి గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఇంతలో అఖిల్ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని, విదేశాల్లో పరిమిత కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరగబోతోందనే వార్త బయటికొచ్చింది. సరే నిశ్చితార్థమైనా హైదరాబాద్ లో జరుగుతుంది కదా అని ఆ రోజు గురించి ఎదురు చూశారు. అయితే నిశ్చితార్థం వేడుక ఈ నెల 9న హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగబోతోందట.
ఆ విషయం తెలిసి అభిమానులు అఖిల్ ఇలా చేశాడేంటి అని వర్రీ అవుతున్నారు. దాంతో వాళ్లు నాగచైతన్య పెళ్లివైపు దృష్టిపెట్టారు. నాగచైతన్య ఒకసారి హిందూ సంప్రదాయం ప్రకారం, మరొకసారి చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసింది. ఈ రెండు వేడుకల్ని గ్రాండ్‌గా నిర్వహించాలని నాగార్జున భావించాడట. ఆ వేడుకకే అభిమానుల్ని ఆహ్వానించే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అఖిల్ పెళ్లి వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగినప్పటికీ నాగార్జున తన అభిమానులందరినీ ఒకరోజు ప్రత్యేకంగా పిలిచి కొత్త జంటని పరిచయం చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/