వీడియో : బాబోయ్ సామ్ 110 కేజీలు ఎత్తేసింది!
సమంత వంటి బక్క పలుచని అమ్మాయి 110 కేజీల బరువు ఎత్తడం మామూలు విషయం కాదు.
హీరోయిన్స్ సుకుమారంగా ఉంటారు, వారు ఎక్కువ సమయం ఎండలో ఉండలేరు, ఎక్కువ బరువు మోయలేరు, ఎక్కువ కష్టపడలేరు అనుకుంటారు. కానీ హీరోలతో సమానంగా వర్కౌట్స్ చేస్తారు అనే విషయం గతంలోనే చాలా సార్లు వెళ్లడి అయింది. హీరోయిన్స్ స్లిమ్‌గా ఫిట్‌గా అందంగా ఉండటం కోసం హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వర్కౌట్స్ చేస్తారు. ముఖ్యంగా సమంత వంటి స్టార్ హీరోయిన్స్ ప్రతి రోజు గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్‌లు చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా సమంత చేసిన ఒక ఫీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సమంత వంటి బక్క పలుచని అమ్మాయి 110 కేజీల బరువు ఎత్తడం మామూలు విషయం కాదు.
సాధారణంగా చేతులతో వెయిట్ లిఫ్ట్ చేస్తారు. అది కండలు రావడానికి ఉపయోగపడుతుంది. కానీ బాడీ మొత్తం ఫిట్‌గా ఉండాలంటే రకరకాలుగా వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. తాజాగా సమంత తన హిప్‌తో బరువును ఎత్తింది. చేతులు, కాళ్ల మీద కూర్చుని పొట్ట, నడుము భాగంతో బరువు ఎత్తి అందరిని సర్‌ప్రైజ్ చేసింది. సమంత అలా పది ఇరవై కేజీల బరువు ఎత్తలేదు. ఏకంగా 110 కేజీల బరువు సునాయాసంగా ఎత్తింది. అంత బరువైన వెయిట్ లిఫ్ట్‌ను ఎలా ఎత్తారు అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సమంత చాలా ఫిట్‌గా ఉంటారు. ఆమె రెగ్యులర్‌గా గంటల తరబడి ఫిట్‌నెస్ కోసం వర్కౌట్‌లు చేస్తూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిమితం అయిన సమంత కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను సైతం ఈమె చేస్తుందనే విషయం తెల్సిందే. నాగ చైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కి మారే ఆలోచనలో సమంత ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అక్కడే సినిమాలు, సిరీస్‌లు చేస్తుంది కనుక కచ్చితంగా బాలీవుడ్‌లోనే ఈమె సినిమాలు చేస్తుందేమో అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు సైతం వ్యక్తం చేస్తున్నారు. సమంత టాలీవుడ్‌లో నటించేందుకు ఓకే చెప్తే ఇప్పటికీ వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయి.
ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్‌లో సమంత నటిస్తుందా అనే విషయమై అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త సీజన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి సమంత ఉందా అనే చర్చ మొదలైంది. ఫ్యామిలీ మ్యాన్ కాకుండా మరో వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తుంది. ఆ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిటాడెల్ కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో సమంత ముందు ముందు మరిన్ని వెబ్ సిరీస్‌లను చేయాలనే ఆసక్తిని కనబర్చుతుందని సమాచారం అందుతోంది. సమంత బాలీవుడ్‌లో యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే సామ్ సినిమా అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.