వీడియో : జిమ్‌లో ఇస్మార్ట్‌ బ్యూటీ గ్లామర్‌ వర్కౌట్స్‌

దాంతో టాలీవుడ్‌లో నభాకి మంచి గుర్తింపు రావడంతో పాటు, ఆఫర్లు సైతం వచ్చాయి.

Update: 2025-02-28 10:57 GMT

కన్నడ మూవీ 'వజ్రకాయ'తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. మొదటి సినిమా తర్వాత చిన్న గ్యాప్‌ తీసుకుని 2017లో తిరిగి అదే కన్నడంలో రెండు సినిమాలతో వచ్చింది. నన్ను దోచుకుందువటే సినిమాతో 2018లో టాలీవుడ్‌కి నభా నటేష్ పరిచయం అయింది. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కడంతో మెప్పించింది. అంతే కాకుండా సింపుల్‌ లుక్‌లో భలే ఉందే అనిపించేంత అందంగా నభా నటేష్ ఆ సినిమాలో ఆకట్టుకుంది. దాంతో టాలీవుడ్‌లో నభాకి మంచి గుర్తింపు రావడంతో పాటు, ఆఫర్లు సైతం వచ్చాయి.



మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించడంతో సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు ఇప్పటికీ చక్కని ఫోటో షూట్స్‌ను షేర్‌ చేస్తూ ఉంటుంది. తక్కువ సమయంలోనే పూరి జగన్నాధ్‌ వంటి స్టార్‌ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ సినిమాలో మరోసారి తన నటనతో మెప్పించింది. కర్ణాటకకు చెందిన ఈ అమ్మడు తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది. కానీ ఈమధ్య కాలంలో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలతో తిరిగి బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నభా ఇంత సన్నగా, అందంగా ఉండటానికి రెగ్యులర్‌గా చేసే వర్కౌట్స్ కారణం అనడంలో సందేహం లేదు. తాజాగా నభా నటేష్ తన వర్కౌట్‌ వీడియోను షేర్‌ చేసింది. జిమ్‌లో హీరోయిన్స్‌ ఫోజ్‌లు ఇస్తారు కానీ పెద్దగా కష్టపడరు అని చాలా మంది అనుకుంటారు. కానీ అలా ఫోజ్‌లు ఇచ్చే జాబితాలో నభా నటేష్ ఉండదు. చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండే నభా నటేష్ జిమ్‌లో ఎంతగా కష్టపడుతుందో ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఈ అమ్మడి అందం మరింత ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది అంటూ కొందరు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్‌ వర్కౌట్‌ వీడియోను నెటిజన్స్ తెగ లైక్ చేస్తున్నారు.

గత ఏడాది డార్లింగ్‌ అనే వెబ్‌మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నభా నటేష్ మరో వైపు స్వయంభు సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ రావాల్సి ఉంది. మరో వైపు ఒకటి రెండు సినిమాల్లో నటించేందుకు గాను చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు, కన్నడంలో ఈ అమ్మడు త్వరలో కొత్త సినిమాలను కమిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలతో ముందు ముందు అయినా నభా నటేష్ హీరోయిన్‌గా బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News