చెల్లి గురించి రష్మిక ఏమంటుందంటే
రీసెంట్ గా ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటిస్తోంది.;
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీ హీరోయిన్ గా చలామణి అవుతుంది రష్మిక మందన్నా. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నేషనల్ క్రష్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటిస్తోంది.
ప్రస్తుతం ఛావా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక రీసెంట్ గా నేహా ధూపియాతో నేహాతో నో ఫిల్టర్ షో లో పాల్గొని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. రష్మికకు ఓ పదేళ్ల చెల్లి కూడా ఉంది. తన పేరు షిమాన్ మందన్నా. తనకు, తన చెల్లికి మధ్య పదహారేళ్ల వయసు తేడా ఉన్నట్టు చెప్పిన రష్మిక ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఎప్పుడూ ఇండిపెండెట్ గా ఉండాలని కోరుకునే రష్మిక సెలబ్రిటీ హోదా కలిగాక కూడా ఆ స్వేచ్ఛకు ఎలాంటి అడ్డు రాకుండా ఉండాలని ఆశిస్తుంది. వీలైనంత వరకు సింపుల్ గా ఉండటానికి ఇష్టపడే రష్మిక, తాను అలా ఉండటానికి తల్లిదండ్రులు తనను పెంచిన విధానమే కారణమని చెప్తుంది. అందుకే రష్మిక తన చెల్లి కూడా తన లానే పెరగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
తనకున్న పరిస్ఠితుల వల్ల ఆమె కోరుకుంది ఏమైనా ఆమె దక్కించుకోవచ్చు. కానీ అది ముఖ్యం కాదని, చిన్నప్పటి నుంచే ప్రతీ వ్యక్తీ ఇండిపెండెంట్ గా ఎదగాల్సిన అవసరం ఉందని చెప్తోంది రష్మిక. ప్రస్తుతం తన చెల్లి చాలా చిన్న పిల్ల అని, ఫ్యూచర్‌లో చెల్లి విషయంలో తనకు చాలా బాధ్యత ఉందని, వయసుతో పాటూ ఆమెకు తాను చాలా సౌకర్యాలు అందించాల్సి ఉందని చెల్లిపై తనకున్న అపారమైన ప్రేమను రష్మిక షేర్ చేసుకుంది.