పిక్‌టాక్ : మిర్రర్ సెల్ఫీతో సెగలు పుట్టిస్తున్న శివంగి
వెండి తెర హీరోయిన్స్‌కి తగ్గకుండా బుల్లి తెర హీరోయిన్స్ ఇన్‌స్టాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.;
బుల్లితెర ముద్దుగుమ్మలు అంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమాల్లో హీరోయిన్స్‌కి ఏ స్థాయి గుర్తింపు అయితే ఉంటుందో ఆ స్థాయిలో లేదా అంతకు మించి గుర్తింపును బుల్లి తెర ముద్దుగుమ్మలు దక్కించుకుంటున్నారు. భాష ఏదైనా బుల్లి తెరకు ఇప్పుడు మంచి గుర్తింపు లభిస్తుంది. సీరియల్స్‌కి ఈమధ్య కాలంలో మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో సీరియల్‌లో అయినా నటించేందుకు సిద్దం అన్నట్లుగా హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. వెండి తెర హీరోయిన్స్‌కి తగ్గకుండా బుల్లి తెర హీరోయిన్స్ ఇన్‌స్టాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
టీవీ సీరియల్స్ ద్వారా గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని హీరోయిన్స్‌గా ఆఫర్లు దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తే ఇండస్ట్రీలో ఎంట్రీ దక్కుతుంది అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఎంతో మంది అందాల ఆరబోత ఫోటోలతో మత్తెక్కిస్తూనే ఉంటారు. తాజాగా బుల్లితెర నటి శివంగి వర్మ తన అందమైన ఇన్‌స్టా ఫోటోలతో ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీ ఫోటోలతో ఆకట్టుకుంది.
హిందీలో ఎన్నో సీరియల్స్‌లో శివంగి వర్మ నటించి మెప్పించింది. హమారీ సిస్టర్ దీదీ, బివి ఔర్ మైన్, భూతు ఇతర ప్రాజెక్ట్‌ల్లోనూ ఈమె కనిపించింది. బుల్లి తెర ద్వారా వచ్చిన గుర్తింపుతో ఇప్పటికే సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. బిచ్చగాడు 2 సినిమాలో ఈమె చేసిన ప్రత్యేక పాటకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ అమ్మడు తన అందంతో ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజా ఫోటో షూట్‌తో అసలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో చేసిన ఈ అమ్మడి ఫోటోలకు తెగ లైక్స్ వస్తున్నాయి.
మత్తు కల్లతో మిర్రర్ ముందు నిల్చుని తన అందమైన నడుమును క్లిక్ అనిపించిన ఈ అమ్మడు నాభి అందంతో మతి పోగొడుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్‌లో అందాల ఆరబోత చేసిన ముద్దుగుమ్మ శివంగికి బాలీవుడ్‌లో మరిన్ని మంచి ఆఫర్లు దక్కాల్సిన అవసరం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడి ఫోటోల జోరు, అందం, ఫిజిక్ చూస్తూ ఉంటే కచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుల్లి తెర నుంచి పర్మినెంట్‌గా వెండి తెరపై ఈ అమ్మడు సందడి చేస్తుందేమో చూడాలి.