పిక్‌టాక్‌ : జలపాతం అందాన్ని మించి మాళవిక అందం..!

కేరళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ 2013లో 'పట్టం పోల్‌' అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.;

Update: 2025-02-28 10:49 GMT

కేరళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ 2013లో 'పట్టం పోల్‌' అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. నటిగా కెరీర్‌ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా తమిళ్‌లో ఈమె నటించిన సినిమాలకు మంచి స్పందన వచ్చింది. తమిళనాట స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా ఈ అమ్మడు నిలిచింది. రజనీకాంత్‌, విజయ్‌ వంటి స్టార్‌ హీరోలతో తమిళనాట సినిమాలు చేసిన మాళవిక మోహనన్‌ టాలీవుడ్‌లో మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు. ఎట్టకేలకు ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది.


మాళవిక మోహనన్‌ ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్‌ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పదేళ్ల తర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్న ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌ సినిమాలో నటించడం ద్వారా కచ్చితంగా ఈమెకు వరుసగా ఆఫర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌కి కన్నుల విందు చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఫాలోవర్స్‌ని ఆకట్టుకునే ఫోటోలను షేర్‌ చేసింది.


సాధారణంగా అందగత్తెలు రెడ్‌ కలర్ డ్రెస్‌ ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారు అంటారు. మాళవిక మోహనన్‌ రెడ్‌ డ్రెస్‌లో నడుము అందం చూపిస్తూ, నాభి అందాన్ని చూపిస్తూ షేర్‌ చేసిన ఈ ఫోటోలు చూపు తిప్పనివ్వడం లేదు. మాళవిక వెనుక అందమైన జలపాతం ఉంది. ఆ జలపాతం అందాన్ని బీట్‌ చేసే విధంగా మాళవిక రెడ్ డ్రెస్ అందం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లాంగ్‌ షాట్‌తో పాటు, క్లోజప్‌లోనూ మాళవిక మోహన్‌ చాలా అందంగా ఈ డ్రెస్‌లో కనిపిస్తుందని, జలపాతం అందాన్ని డామినేట్‌ చేసే విధంగా మాళవిక ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఈ ఫోటోలతో పాటు మాళవిక ఇన్‌స్టాగ్రామ్‌లో.. నా ఆత్మ చాలా సంతోషంగా ఉన్న చోట, దట్టమైన అడవిలో, అత్యంత అందమైన జలపాతం కింద నా ముఖం మీద పొగమంచు పడుతూ, ప్రతి శ్వాసలో అడవి సువాసనను అనుభవిస్తూ ఉన్నాను. బంగారు కిరణాలతో పందిరి గుండా సూర్య కాంతి నా ముఖం మీద పడుతుంటే చాలా సంతోషంగా ఉందని, ఈ అద్భుతమైన ప్రకృతి అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. మేము ఒక సరస్సు కి వచ్చాము. చిన్న ప్రవాహాల మీదుగా దూకుతున్న జలపాతంలోకి మేము దిగాము అంటూ పోస్ట్‌ పెట్టింది. చక్కని ముద్దుగుమ్మకు జలపాతం చూడగానే కవిత్వం వచ్చిందా అంటూ కొందరు సరదా కామెంట్స్ సైతం చేస్తున్నారు.

Tags:    

Similar News