లెజెండరీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితంలోని సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ బయోపిక్ ''83''. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారు. కపిల్ దేవ్ భార్య రోమీ దేవ్ గా రణవీర్ సతీమణి దీపికా పదుకునే నటించారు. కోవిడ్ కారణంగా వాయిదా పడుతున్న ఈ సినిమాని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
'83' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో హిందీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున అక్కినేని ఈ బయోపిక్ ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం అన్ని భాషలకు సంబంధించిన ట్రైలర్స్ ను మేకర్స్ ఆవిష్కరించగా.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
తెలుగు వెర్షన్ '83' కోసం అక్కినేని హీరో సుమంత్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతరమెత్తారు. కపిల్ దేవ్ పాత్ర పోషించిన రణ్ వీర్ కి సుమంత్ వాయిస్ అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు లెజెండరీ క్రికెటర్ బయోపిక్ ను ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తోంది. అందుకే తెలుగు డబ్బింగ్ లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
ఈ క్రమంలో హోమ్ బ్యానర్ కోసం సుమంత్ డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడని తెలుస్తుంది. ఆశ్చర్యకరంగా, సుమంత్ వాయిస్ రణవీర్ సింగ్ కు బాగా సెట్ అయింది. మరో హీరో రాహుల్ రవీంద్రన్ కూడా '83' సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారారు. 'రంగం' ఫేమ్ జీవా పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకు రాహుల్ వాయిస్ ఇచ్చాడు. ఇప్పటికే సతీమణి చిన్మయి సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తుండగా.. ఇప్పుడు రాహుల్ కూడా యూఎంతో పర్ఫెక్ట్ గా డబ్బింగ్ చెప్పాడు.
'83' ట్రైలర్ విషయానికొస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన భారత జట్టు.. 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచే ప్రయాణాన్ని చూపించే ప్రయత్నం చేసారు. మెగా టోర్నీలో భారత జట్టు ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందులు, ఆనందక్షణాలను ఇందులో ఎంతో ఆసక్తిగా చూపించారు. అప్పట్లో క్రికెటర్లు ఇంగ్లిష్ మాట్లాడడం రాక ఇబ్బంది పడడం - మీడియాతో పాటుగా విదేశీ జట్లు హేళన చేయడం - ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చోటు చేసుకున్న ఉత్కంఠభరిత సంఘటనలతో కూడిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ని అలరిస్తోంది.
కాగా, ''83'' చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ - ఫాంటమ్ ఫిలిమ్స్ సమర్పణలో కబీర్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. దీపికా పదుకునే - కబీర్ ఖాన్ - విష్ణు వర్ధన్ ఇందూరి - సాజిద్ నడియావాలా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాని తమిళంలో కమల్ హాసన్ - మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ - కన్నడలో కిచ్చా సుదీప్ విడుదల చేస్తుండటం విశేషం. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Full View