హ‌నీరోజ్ వేధింపుల‌ కేసు: బెయిల్ వ‌చ్చినా కానీ..!

ఈ వేధింపుల కేసులో చిక్కుకున్న వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ మంగళవారం కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ అత‌డు జైలులోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Update: 2025-01-15 04:07 GMT

త‌న‌ను వేధిస్తున్నాడంటూ ప్ర‌ముఖ బిజినెస్ మేన్ బాబీ చెమ్మ‌నూర్ పై మ‌ల‌యాళ క‌థానాయిక‌ హ‌నీరోజ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వేధింపుల కేసులో చిక్కుకున్న వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ మంగళవారం కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ అత‌డు జైలులోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆరు రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చెమ్మనూర్ సాంకేతిక కారణాల వల్ల విడుదల కాలేకపోతున్న ఇత‌ర‌ ఖైదీలకు సంఘీభావం ప్రకటించడమే తన నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు.

చెమ్మనూర్ తన న్యాయ బృందానికి తన నిరసనను తెలియజేశారు. అటువంటి ఖైదీల సమస్య పరిష్కరించే వరకు తాను జైలు నుండి బయటకు వెళ్లబోనని పేర్కొన్నారు. బాబీ వైఖరి అత‌డి విడుదల కోసం వేచి చూసిన మద్దతుదారులను నిరాశపరిచింది. అత‌డి త‌ర‌పున‌ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్‌తో కాకనాడ్ జిల్లా జైలుకు చేరుకోగా.. తాను జైలు నుంచి బ‌య‌ట‌కు రాలేన‌ని చెమ్మ‌నూరు వారికి చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైకోర్టు బెయిల్ ఆర్డర్ జారీ చేసింది. ఆ తర్వాత అతడి న్యాయ బృందం జైలును సంప్రదించింది. అయితే బెయిల్ షరతుల ప్రకారం బాండ్‌పై సంతకం చేయనని చెమ్మనూర్ వారికి తెలియజేయడంతో వారు లోపలికి వెళ్లలేదని సమాచారం. నిర్దేశిత కాలపరిమితిలో లోపం కారణంగా విడుదల ఆర్డర్‌ను ప్రాసెస్ చేయలేమని జైలు అధికారులు సూచించారు. చెమ్మనూర్ నిర్ణ‌యంపై ఈ బుధవారం హైకోర్టుకు ప్రాసిక్యూటర్లు తెలియజేస్తారని భావిస్తున్నారు.

హ‌నీరోజ్ విష‌యంలో కేసును కేర‌ళ హైకోర్టు ప‌రిశీలించింది. ఈ ప‌రిశీల‌న‌లో అత‌డి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌ల‌ను కోర్టు న్యాయ‌మూర్తులు ప‌రిశీలించారు. ఇతరులకు హాని కలిగించే బహిరంగ ప్రకటనలను చేయ‌డం నేరం! అంటూ కేరళ హైకోర్టు గతంలో చెమ్మనూర్‌ను హెచ్చరించింది. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. విచారణ సందర్భంగా కోర్టు అతడి ప్రకటనల దృశ్యాలను సమీక్షించాక‌.. అతడికి నిరంతర కస్టడీ అనవసరమని పోలీసులు నిర్ధారించ‌గా, కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది.

నాలుగు నెలల క్రితం జరిగిన ఒక సంఘటనలో చెమ్మనూర్ తన గురించి అవమానకరమైన భాషను ఉపయోగించారని మలయాళ నటి హనీ రోజ్ ఆరోపించ‌డంతో గొడ‌వ మొద‌లైంది. హ‌నీరోజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఆమెపై సైబర్ దాడులు పెరిగాయి. తరువాత స‌ద‌రు న‌టీమ‌ణి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీని ఫలితంగా జనవరి 8న బాబీ చెమ్మ‌నూరు త‌న‌ వయనాడ్ రిసార్ట్‌లో అరెస్టు అయ్యాడు. అధికారులు అత‌డితో పాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేసారు. హ‌నీరోజ్‌పై ర‌క‌ర‌కాలుగా ఆన్‌లైన్ లో దాడుల‌కు పాల్ప‌డిన వ్యక్తులను అరెస్టు చేశామ‌ని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News