స్టార్ హీరో లవ్ స్టోరీ.. సినిమాకు తక్కువ కాదంతే..!
తన వైఫ్ జెస్సీని ఆయన చాటింగ్ లోనే పరిచయం అయ్యారు. అలా చాటింగ్ లో ఒకరినొకరు అర్ధం చేసుకుని తమ ప్రేమను పంచుకున్నారు.
ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టే ప్రేమ కథలు చాలా వచ్చాయి.. చాలానే వస్తాయి. ఐతే రీల్ లైఫ్ లవ్ స్టోరీకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉండేలా ఒక స్టార్ హీరో లవ్ స్టోరీ తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి జెస్సీల లవ్ స్టోరీ సినిమాకు ఏమాత్రం తగ్గని టర్నులు ట్విస్టులు ఉన్నాయట. ఆన్ లైన్ చాటింగ్ లో ప్రేమ పుట్టి ఆ ప్రేమ నిజమై జీవితాన్ని పంచుకోవడం అన్నది చాలా గొప్ప విషయం.
విజయ్ సేతుపతి ఇప్పుడొక పెద్ద స్టార్ కానీ ఆయన ఒకప్పుడు దుబాయ్ లో ఉద్యోగం చెసే టైం లో చాలా కష్టపడ్డారు. అంతేకాదు తన వైఫ్ జెస్సీని ఆయన చాటింగ్ లోనే పరిచయం అయ్యారు. అలా చాటింగ్ లో ఒకరినొకరు అర్ధం చేసుకుని తమ ప్రేమను పంచుకున్నారు. ఇద్దరి వ్యక్తుల ప్రేమకు వాళ్ల కుటుంబ సభ్యులే విలన్లు అన్నట్టుగా ఉంటుంది. అలానే విజయ్ సేతుపతి, జెస్సీల ప్రేమకు వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోలెదట.
విజయ్ సేతుపతి తమిళియన్, జెస్సీ మలయాళీ అవ్వడం వల్ల వారి ప్రేమకు విజయ్ సేతుపతి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదట. ఐతే ఎలాగోలా వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. విజయ్, జెస్సీల ప్రేమకథలో మరో ట్విస్ట్ ఏంటంటే.. జెస్సీని విజయ్ సేతుపతి మొదటిసారి ఎంగేజ్మెంట్ రోజే కలిశారట. సో ఎంగేజ్మెంట్ లో చూసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
చాటింగ్ లో పరిచయమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమే. అసలు ఎంగేజ్మెంట్ దాకా చూడకుండా డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం మరో విశేషం. అలా విజయ్ సేతుపతి జెస్సీల లవ్ స్టోరీ ఒక సినిమాకు ఏమాత్రం తక్కువ కాదన్నట్టుగా నడిచింది. జెస్సీ సంతోషంగా ఉండేందుకు విజయ్ సేతుపతి ఆమెకు ఎప్పుడు సపోర్ట్ గా ప్రేమగా ఉంటున్నారు. విజయ్ సేతుపతి, జెస్సీల లవ్ స్టోరీ ఇప్పటి ప్రేక్షకులకు షాక్ ఇస్తుందని చెప్పొచ్చు.
ఇక విజయ్ సేతుపతి మొన్నటిదాకా సోలో సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. కానీ ఈమధ్య ఇక మీదట అలాంటివి చేయకూడదు అని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. విజయ్ సేతుపతి తమిళ హీరోనే అయినా ఆయనకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.