బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. మిగతా బాలీవుడ్ స్టార్ హీరోలు స్టంట్స్ చేసే సమయంలో డూపులను ఉపయోగిస్తారేమో కానీ అక్షయ్ అలా చేసే రకం కాదు. హెలికాప్టర్ ను పట్టుకొని వేలాడటం లాంటి స్టంట్స్ ఇప్పటివరకూ ఎన్నో చేసిన ఘనత అక్షయ్ సొంతం. ఇదిలా ఉంటే తాజగా మరోసారి తనలోని డేర్ డెవిల్ మ్యాన్ ను బయటపెడుతూ ఫైర్ స్టంట్ చేశాడు అక్షయ్.
అక్షయ్ కుమార్ రీసెంట్ గా 'ది ఎండ్' అనే పేరుతో తెరకెక్కనున్న వెబ్ సీరీస్ లో నటించేందుకు అంగీకారం తెలిపాడు. అక్షయ్ తనయుడు ఆరవ్ ప్రోద్బలంతోనే వెబ్ సీరీస్ లో నటించేందుకు ఒప్పుకున్నాడట. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సీరీస్ టైటిల్ లాంచ్ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేజ్ మీదకు తన వెనకవైపు సూటు.. ప్యాంటుకు నిప్పంటించుకుని.. వాటికి మంటలు వస్తూ ఉండగా నడుచుకుంటూ వచ్చి అమెజాన్ ప్రైమ్ హెడ్ జెన్నిఫర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఈ స్టంట్ గురించి తెలిసిన తర్వాత అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ ద్వారా చెడామడా తిట్టేసింది. ట్విట్టర్ ద్వారా "క్రాప్! ఇలానా నిన్ను నువ్వు మంటల్లో తగలబెట్టుకునేది. ఒకవేళ బతికి బట్టకడితే ఇంటికి రా.. నేను నిన్ను చంపేస్తా! దేవుడే నన్ను కాపాడాలి!" ఇలాంటి రిస్కీ స్టంట్ చేసినందుకు అక్షయ్ కుమార్ కు వారం రోజుల పాటు భార్యామణి సాధింపు తప్పదేమో!