బాలీవుడ్ లో దశాబ్ధాల పాటు ఎదురేలేని హీరోగా హవా సాగించిన స్టార్ హీరో `ఖిలాడీ` అక్షయ్ కుమార్ ఒకే ఒక్క వివాదాస్పద వ్యాఖ్యతో 500 కోట్ల డీల్ కోల్పోయాడని బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. అతడు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో అవకాశాలు కోల్పోయాడు. అంతకుముందు కూడా ఒక యువహీరోకి వేరొక క్రేజీ ఫ్రాంఛైజీ ఆఫర్ ని కోల్పోయాడు. ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషికం లాభాల్లో వాటాలు అందుకునే సదరు హీరో కేవలం ఈ రెండు మూడు నెలల్లోనే ఏకంగా 500 కోట్ల విలువైన డీల్ ని కోల్పోయాడని విశ్లేషిస్తున్నారు.
ఇది అనూహ్యమైన పరిణామం. ఊహాతీతమైన నష్టం. అతడు ఇంతగా నష్టపోవడానికి కారణం కూడా చాలా విచిత్రమైనది. తనకు ఆఫర్ చేసిన సినిమా స్క్రిప్ట్ తనకు నచ్చలేదని అందుకే తిరస్కరించానన్న ఒకే ఒక్క మాటతో అతడు నిర్మాతను తీవ్రంగా హర్ట్ చేసాడు. దీంతో ఈ సీక్వెల్ లో అవకాశం కోల్పోవడమే గాక తదుపరి తెరకెక్కించే మరో రెండు భారీ సీక్వెల్స్ లో కూడా అక్షయ్ కుమార్ అవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చింది. కేవలం ఈ మూడు సినిమాల రూపంలోనే అతడు 300-400 కోట్ల మేర నష్టపోయాడని విశ్లేషిస్తున్నారు.
ఇటీవలే బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ హేరాఫేరి సిరీస్ నుంచి అక్షయ్ వైదొలిగినట్టు ప్రకటన వెలువడింది. హేరా ఫేరి 3 స్క్రిప్టు తనకు నచ్చలేదని అందుకే తిరస్కరించానని అక్షయ్ ఒక బహిరంగ వేదిక పై ప్రకటించడంతో నిర్మాత ఫిరోజ్ నడియావాలా తీవ్రంగా హర్టయ్యారు. `హేరా ఫేరి 3`పై అక్షయ్ కుమార్ చేసిన ఆ ఒక్క ప్రకటనతో ఎంతో బాధపడ్డ ఫిరోజ్ నడియాడ్ వాలా తదుపరి నిర్మించే `ఆవారా పాగల్ దీవానా 2`- `వెల్ కమ్ 3` చిత్రాల నుంచి అక్షయ్ ని తొలగించాలని నిర్ణయించుకున్నాడని హిందీ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మోస్ట్ అవైటెడ్ `హేరా ఫేరి 3`కి సంబంధించి గత వారంలో మీడియాలో రకరకాల కథనాలొచ్చాయి. నవంబర్ 11న పరేష్ రావల్ ఎవరూ ఊహించని విధంగా కార్తిక్ ఆర్యన్ `హేరా ఫేరి 3`ని తన ఖాతాలో వేసుకున్నాడని ఒక అభిమానితో చాటింగ్ లో ధృవీకరించారు. ఇది అక్షయ్ కుమార్ అభిమానులకు కోపం తెప్పించింది. పైగా అక్షయ్ స్థానంలో కార్తీక్ ఆర్యన్ ని నిర్మాత ఎంపిక చేయడంతో అక్కీ అభిమానులు కినుక వహించారు. ఇంతకుముందే బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ భూల్ భులయా సీక్వెల్లోను అక్షయ్ స్థానంలో యువహీరో కార్తీక్ అవకాశం దక్కించుకుని బంపర్ హిట్ కొట్టి చూపించాడు. `భూల్ భూలయ్యా 2 (2022) లో తనదైన నటనతో మెప్పించి క్రైసిస్ లోను కాసుల వర్షం కురిపించిన లక్కీ హీరోగా వెలిగిపోయాడు.
నిజానికి భూల్ భులయా 2లలో అక్షయ్ అవకాశం కోల్పోవడానికి కారణం అతడు దాదాపు 90 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు లాభాల్లో వాటా అడగడమేనని ప్రముఖ మీడియాలో ఓ కథనం వెల్లడించింది. అంత పెద్ద మొత్తం డిమాండ్ చేయడంతో నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా అక్షయ్ ని కాదనుకుని కార్తీక్ ఆర్యన్ తో ముందుకు వెళ్లాడు. అక్షయ్ కోసం 90 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా ఇవ్వాలి. కానీ కార్తీక్ ఆర్యన్ కి రూ. 30 కోట్లు ముట్టజెబితే సరిపోతుంది. అందుకే అక్షయ్ ని కాదనుకుని కార్తీక్ ఆర్యన్ ని ఫిరోజ్ నడియాడ్ వాలా తెరపైకి తెచ్చాడు.
అయితే ఢిల్లీలో జరిగిన 20వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2022 కార్యక్రమంలో అక్షయ్ కుమార్ `హేరా ఫేరి 3` నుండి వైదొలిగినట్లు ధృవీకరించారు. సినిమా స్క్రిప్ట్ తో తాను సంతోషంగా లేనందున సీక్వెల్ ను తిరస్కరించాల్సి వచ్చిందని అతను వాదించాడు. తాజా గుసగుసల మేరకు.. హేరా ఫేరీ 3 లో భాగం కాలేకపోవడంపై అక్షయ్ కుమార్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అతని కెరీర్ లోనే ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఫిరోజ్ నదియాడ్ వాలా పూర్తిగా ఆచరణాత్మకంగా ఉన్నాడు. అక్షయ్ తన పారితోషికాన్ని ఇతర డిమాండ్లను తగ్గించుకునేందుకు నిరాకరించాడు. ఇది వన్-వే స్ట్రీట్ కాకూడదు... నిర్మాత నష్టపోతున్నప్పుడు అక్షయ్ మాత్రమే డబ్బు సంపాదించడం సరికాదు. మహమ్మారి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. హీరోలు పారితోషికాన్ని తగ్గించడం తప్ప వేరే మార్గం లేదు. కానీ అక్షయ్ దానికి ససేమిరా అన్నాడు. అయినా ఎంతో ఓపిగ్గా ఫిరోజ్ అక్షయ్ కి ప్రస్తుత సన్నివేశాన్ని వివరించడానికి ప్రయత్నించాడు. కానీ అతను పశ్చాత్తాపపడలేదు. వేరే మార్గం లేని పక్షంలో ఫిరోజ్ నదియాడ్ వాలా కార్తిక్ ఆర్యన్ ని హేరా ఫేరి 3 కోసం ఎంపిక చేసుకున్నాడు. దీంతో ``ఫిరోజ్ అంటే వ్యాపారం మాత్రమే``నని అక్షయ్ కుమార్ గ్రహించాడు.
ఈ ఎపిసోడ్ తర్వాత కూడా ఫిరోజ్ నదియాడ్ వాలా `ఆవారా పాగల్ దీవానా 2`... `వెల్ కమ్ 3`ని రూపొందించాలని ప్లాన్ చేసారు. ఈ రెండు అత్యంత క్రేజీ సీక్వెల్స్ కు నిర్మాతగా ఫిరోజ్ మొదటి ఎంపిక అక్షయ్ కుమార్ అని స్పష్టం చేశాడు. అతను కనీసం అక్షయ్ తో కూర్చుని చర్చించి తొలుత పలు వాణిజ్య ప్రకటనల కోసం కలిసి పని చేయాలని ఆశించాడు. తద్వారా ఇది అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.
అయితే ఇంతలోనే కథ మలుపు తిరిగింది. స్క్రిప్ట్ లో సమస్యల కారణంగా అక్షయ్ కుమార్ హేరా ఫేరి 3 నుండి నిష్క్రమిస్తున్నట్లు బహిరంగంగా పేర్కొన్న తర్వాత ఫిరోజ్ చాలా నిరాశకు గురయ్యాడు.. చాలా కలత చెందాడు. దీంతో అతను ఇప్పుడు అక్షయ్ లేకుండానే ఆవారా పాగల్ దీవానా 2- వెల్ కమ్ 3 చిత్రాలను నిర్మించాలని వేరొక హీరోతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే ప్రస్తుతం `హేరా ఫెరి 3` చిత్రీకరణ కోసం కసరత్తులో ఉన్న నేపథ్యంలో ఇతర విషయాలేవీ నిర్మాతలు ప్రకటించలేదని గుసగుస వినిపిస్తోంది.
ఏది ఏమైనా అక్షయ్ కుమార్ కి బ్యాడ్ టైమ్ రన్ అవుతోంది. ఈ ఏడాది అతడు నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యాయి. దీనికి తోడు బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీలన్నిటి నుంచి అవకాశాలు కోల్పోతున్నాడు. అతడి స్థానంలో కార్తీక్ ఆర్యన్ తెలివిగా ఆఫర్లన్నీ కొట్టేస్తున్నాడు. కేవలం ఈ మూడు నెలల్లోనే అక్షయ్ కి దాదాపు 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టేనని అర్థశాస్త్ర గణాంక నిపుణులు విశ్లేషిస్తున్నారు. హేరాఫేరి 3 తరహాలోనే ఇతర సీక్వెల్స్ ని కూడా నిర్మాత ఫిరోజ్.. యువహీరో కార్తీక్ ఆర్యన్ తోనే రీప్లేస్ చేస్తారా? అన్నదానికి క్లారిటీ రావాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.