ప్రభాస్ సరసన ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ!

Update: 2020-05-21 17:00 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది. పూర్వ జన్మల ఆధారంగా ఓ మంచి ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఇక ఈ సినిమాకు ఓ మై డియర్, రాధేకృష్ణ అనే పేర్లను పరిశీలిస్తున్నారట. ఈ ఏడాది నవంబర్ నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఈ సినిమా కూడా వివిధ బాషలలో విడుదల కానుంది. ముఖ్యం మన తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియన్ మూవీలు చేసేటప్పుడు హీరోయిన్ల కోసం బాలీవుడ్ వైపే మొగ్గు చూపుతారు. హీరోయిన్ ఎంపికలో మాత్రం డైరెక్టర్లు బాగానే కసరత్తులు చేస్తారు.

అందులో భాగంగానే తాజాగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ ఇంటర్నేషనల్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా.. హీరోయిన్ ఎంపిక కోసం నాగ్ అశ్విన్ చాలా మంది లిస్టే అనుకుంటున్నాడట. ఇప్పుడు ఆ లిస్టులోకి బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ చేరింది. ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ గా అలియాను సంప్రదించగా - తను కూడా ప్రభాస్ తో వర్క్ చేయడానికి సుముఖంగా ఉందని సమాచారం. షూటింగ్స్ మొదలవగానే నాగ్ అశ్విన్ ముంబై వెళ్లి అలియాకు కథ చెప్పనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అలియా భట్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో పాన్ ఇండియన్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఒకటి. ఈ సినిమా అనంతరం అలియా ప్రభాస్ సినిమా చేయనున్నట్లు సినీవర్గాలు అంటున్నాయి. ఇక ఈ భారీ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News