ఫోటో స్టోరి: కాస్మోతో కాస్కోండి అంటోంది

Update: 2016-09-14 22:30 GMT
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ కి బాగా స్పీడ్ ఎక్కువే. స్పీడ్ గా సినిమాలు చేయడం లోనే కాదు.. అటు డ్రసింగ్ నుంచి ఇటు ఒపీనియన్స్ ని ఎక్స్ ప్రెస్ చేయడం వరకూ నేను బాగా స్ట్రైట్ ఫార్వార్డ్ అంటూ ఉంటుంది ఆలియా. రీసెంట్ గా ఉడ్తా పంజాబ్ మూవీలో యాక్టింగ్ ని ఇరగదీసేసి.. తన ట్యాలెంట్ కూడా చూపించేసింది. ఇప్పటికే ఈ ఏడాది ఆలియా నటించిన రెండు సినిమాలు విడుదల కాగా.. నవంబర్ లో షారూక్ స్పెషల్ రోల్ చేసిన డియర్ జిందగీ కూడా విడుదల కానుంది.

ఈ సినిమాల లెక్కంతా ఒక ఎత్తైతే.. అమ్మడి అందాల ప్రదర్శన మరో ఎత్తు. కాస్మోపాలిటన్ మేగజైన్ సెప్టెంబర్ ఎడిషన్ కి కవర్ పేజ్ పై కనిపించిన ఆలియా భట్.. చాలానే మాయలు చేసింది. ఓ రెండు బటన్స్ ను విప్పేసిన బ్లూ కలర్ డిజైనర్ టాప్.. నేవీ బ్లూ రంగులో మినీ వేసుకుని.. ఫ్యాన్స్ కి నయనానందం కలిగించింది. ఇక కవర్ పేజ్ పై కాబట్టి కాస్త కంట్రోల్డ్ గా ఉన్నా అన్నట్లుగా లోపలి పేజీల్లో మరింతగా రెచ్చిపోయింది ఆలియా. అన్నిటిలోకి బ్లాక్ ట్రాన్స్ పరెంట్ టాప్ లోంచి మెరుస్తున్న ఆలియా అందాలను చూసి తరించాల్సిందే తప్ప.. వర్ణించడానికి అలవి కాని పని.

యంగ్ హీరో వరుణ్ ధావన్ తో ఆలియాకి సంథింగ్ సంథింగ్ అనే టాక్ ఉంది కానీ.. ఇప్పటివరకూ కన్ఫర్మేషన్ లేదంతే. రీసెంట్ గా అమెరికాలో డ్రీమ్ టూర్ కోసం వీళ్లిద్దరూ కలిసి చక్కర్లు కొట్టి బాగా కష్టపడిపోయారని టాక్.
Tags:    

Similar News