పిక్‌టాక్ : స్టైల్ ఐకాన్‌గా ప్రణీత
2010లో దర్శన్ హీరోగా నటించిన 'పోర్కి' అనే కన్న సినిమాలో ప్రణీత సుభాష్ హీరోయిన్‌గా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయింది.;
2010లో దర్శన్ హీరోగా నటించిన 'పోర్కి' అనే కన్న సినిమాలో ప్రణీత సుభాష్ హీరోయిన్‌గా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమాతో కన్నడంలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ వెంటనే తెలుగులో ఎమ్ పిల్లో ఎమ్ పిల్లాడో సినిమాలో నటించింది. ఆ సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా ప్రణీతకు అవకాశాలు ఇవ్వచ్చు అన్నట్లుగా టాక్ సొంతం చేసుకుంది. అందుకే సిద్దార్థ్‌కి జోడీగా బావా సినిమాలో నటించే అవకాశం సొంతం అయింది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న ప్రణీతకు బావా తీవ్రంగా నిరాశ మిగిల్చింది. అయినా కూడా ఇండస్ట్రీలో ప్రణీతకి ఆఫర్లు రావడం కొనసాగింది.
కన్నడ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రణీత సుభాష్ ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా 15 ఏళ్లు అవుతుంది. అయినా ఇప్పటి వరకు సినిమాల్లో కొనసాగుతూనే వచ్చింది. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా ప్రణీత స్టైల్ ఐకాన్‌గా నిలుస్తున్న కారణంగా ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది. సాధారణంగా సౌత్ హీరోయిన్స్ కొందరు పెళ్లి తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరం కావాలని అనుకుంటారు. కానీ ప్రణీత మాత్రం గత ఏడాది కూడా ఈమె నటించింది. గత సంవత్సం ఈమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
గర్భంతో ఉన్న సమయంలోనూ ప్రణీత కెమెరా ముందుకు వచ్చిందని కన్నడ సినీ వర్గాల వారు అంటూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే కన్నడ సినిమా ఇండస్ట్రీలో నటిగానే కాకుండా ప్రణీతకు ఒక మనిషిగా మంచి పేరు ఉంది. కరోనా సమయంలో ఎంతో మంది ఆకలి తీర్చిందని ఆమెను ఇప్పటికీ చాలా మంది అభినందిస్తూ ఉంటారు. అలాంటి మంచి మనసున్న ప్రణీత తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు ఆమె అందంను చూపించకనే చూపిస్తున్నాయి. బ్లాక్ షర్ట్ ధరించి, స్టైలిష్ లుక్‌లో యాక్ససిరీస్‌ను ధరించిన ప్రణీత చూపు తిప్పనివ్వడం లేదు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పెళ్లి చేసుకుని, తల్లి అయిన తర్వాత ఫ్యాషన్‌పై, స్టైలింగ్‌పై పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ ప్రణీత మాత్రం రెగ్యులర్‌గా ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం కోసం ఫ్యాషన్‌గా కనిపిస్తూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. స్టైల్ ఐకాన్ అని పిలిపించుకునే ప్రణీత మరోసారి తన సింపుల్ అండ్ స్వీట్ పిక్స్‌తో నెటిజన్స్ మతి పోగొడుతుంది. స్కిన్ షో చేయకుండా ఇంత స్టైలిష్‌గా అందంగా హీరోయిన్స్ కనిపించవచ్చు అని ప్రణీతను చూస్తూ ఉంటే అర్థం అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.