స్టార్ హీరోయిన్‌కి గాయం... 13 కుట్లు
మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన భాగ్యశ్రీ చేసినవి తక్కువ సినిమాలే అయినా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది.;
మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన భాగ్యశ్రీ చేసినవి తక్కువ సినిమాలే అయినా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన భాగ్యశ్రీ అయిదు పదుల వయసులోనూ నటిగా కొనసాగుతోంది. 2023లో ఈమె నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా విడుదలైన విషయం తెల్సిందే. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు ఎప్పుడూ భాగ్యశ్రీని సంప్రదిస్తూ ఉంటారు. అయితే ఆచితూచి మరీ సినిమాలను భాగ్యశ్రీ ఎంపిక చేసుకుంటారు. భాగ్యశ్రీ సినిమాల కోసం ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు.
నటిగా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుని, లక్షలాది మంది అభిమానం సొంతం చేసుకున్న భాగ్యశ్రీకి ప్రమాదం జరిగింది. పికిల్ బాల్ ఆడుతున్న సమయంలో ఆమె నుదిటి పై గాయం అయింది. ఆ గాయం మరీ లోతుగా కావడంతో ఏకంగా 13 కుట్లు వేసినట్లు వైద్యులు తెలియజేశారు. వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలుస్తోంది. త్వరలోనే ఆమె కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. తెలుగులో ఈమె నటించిన రాధేశ్యామ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మగా కూడా చాలా అందంగా ఉన్నారు అంటూ ఆ సమయంలో భాగ్య శ్రీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.
1998లో యువరత్న రాణా సినిమాలో బాలకృష్ణకు జోడీగా నటించడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నటించేందుకు గాను అప్పట్లో భాగ్యశ్రీ రికార్డ్ స్థాయి పారితోషికం తీసుకుందని అంటూ ఉండేవారు. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగులో నటించేందుకు ఓకే చెప్పారు. ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపించలేదు. హిందీ, తెలుగు సినిమాలతో పాటు భాగ్యశ్రీ కన్నడ, భోజ్‌పురి, మరాఠి, బెంగాళి భాషల సినిమాల్లోనూ నటించడం ద్వారా దేశ వ్యాప్తంగా భాగ్యశ్రీ గుర్తింపు సొంతం చేసుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. అరుదైన రికార్డ్‌లను సొంతం చేసుకున్న భాగ్యశ్రీ ఎన్నో రికార్డ్‌లను, రివార్డ్‌లను సొంతం చేసుకుంది. భాగ్యశ్రీ అందం విషయంలో ఇప్పటికీ చాలా మంది ఆమెను చూసి అసూయ పడుతూ ఉంటామని అంటారు. అలాంటి అందమైన నటికి ఇలా నుదుటిపై గాయం కావడం అనేది చాలా బాధాకర విషయం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భాగ్యశ్రీ వెంటనే కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో తెగ మెసేజ్‌లు చేస్తున్నారు.