50లో గ్లామర్ ట్రీట్.. యువ హీరోయిన్స్ తేలిపోవాల్సిందే..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు షేర్ చేయగానే అవి వైరల్‌గా మారాయి. మలైకా అరోరా గ్లామర్, స్టైల్ గురించి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.;
బాలీవుడ్‌లో స్టైల్ ఐకాన్‌గా, ఫిట్‌నెస్ క్వీన్‌గా తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా మరొకసారి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. వయసు పెరుగుతున్నా అందంలో ఎలాంటి తేడా లేకుండా తన స్టైల్‌ను మరింత మెరుగుపరుస్తూ యువ తారలకు పోటీ ఇస్తోంది. తాజాగా మలైకా అరోరా నల్లటి బాడీకాన్ డ్రెస్‌లో మెరిసిపోతోంది. ఈ ఫోటోషూట్‌లో ఆమె మరింత గ్లామరస్ గా, స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాషన్ ప్రియులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. చెవికి భారీ ఈయర్ రింగ్స్, మెడలో గోల్డెన్ నెక్లెస్ ధరించి ఎట్రాక్షన్‌ను పెంచేసింది.
ఈ గ్లామరస్ లుక్ వెనుక స్టైలింగ్, మేకప్ ఫోటోగ్రఫీ టీమ్‌ను కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మలైకా వేషధారణను ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేయగా, స్టైలింగ్ టీమ్ తన మేకోవర్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. మేకప్‌లో బ్రౌన్ టోన్లు, మెటాలిక్ షేడ్స్ వాడటం ఆమె లుక్‌ను మరింత హైలైట్ చేస్తోంది. ఈ ఫోటోషూట్‌లో నల్లటి జంప్‌సూట్‌కు బ్లాక్ కోట్ జతచేయడం మరింత డాషింగ్‌గా కనిపించేలా చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు షేర్ చేయగానే అవి వైరల్‌గా మారాయి. మలైకా అరోరా గ్లామర్, స్టైల్ గురించి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఎప్పుడూ గ్లామరస్ గా ఉండే మలైకా ఇప్పుడు మరింత స్టన్నింగ్‌గా కనిపిస్తోంది’ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే ఆమె ఈ ఫోటోషూట్‌తో మరోసారి ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేసింది.
కెరీర్ విషయానికి వస్తే, మలైకా మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి, వెండితెరపై ఐటెం నంబర్లతో సంచలనం రేపింది. 'చయ్య చయ్య', 'మున్ని బద్నామ్ హుయీ' వంటి పాటలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. డాన్స్, ఫిట్‌నెస్, గ్లామర్ మిక్స్ చేసి ఎప్పటికప్పుడు తన క్రేజ్‌ను కొనసాగిస్తూ అప్పుడప్పుడు టీవీ షోస్‌లో జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఈ ఫోటోషూట్‌తో మరోసారి మలైకా అరోరా ఫ్యాషన్ ఫ్రంట్లో తన స్థాయిని ప్రూవ్ చేసుకుంది. 50లోకి వచ్చినా స్టైల్‌కి బ్రేక్ వేయకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్‌లో అభిమానులను అలరిస్తోంది.