ఆర్‌ ఆర్‌ ఆర్‌ కోసం రెడీ అయ్యింది

Update: 2019-07-07 07:03 GMT
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ క్యూట్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతా రామరాజు పాత్రను పోషిస్తున్న రామ్‌ చరణ్‌ కు జోడీగా మరదలు సీత పాత్రలో ఆలియా భట్‌ నటించబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయ్యి కొంత పార్ట్‌ చిత్రీకరణ కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆలియా భట్‌ షూటింగ్‌ లో పాల్గొన్న దాఖలాలు అయితే కనిపించలేదు. ఎట్టకేలకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చిత్రీకరణలో ఆలియా నటించేందుకు సిద్దం అయ్యింది.

అతి త్వరలోనే అహ్మదాబాద్‌ మరియు పూణెలోని పలు ఏరియాల్లో చిత్రీకరణకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రాజమౌళి తిరిగి వచ్చిన వెంటనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కాబోతుంది. ఇక ఇదే సమయంలో రనబీర్‌ కపూర్‌ తో హాలీడే ట్రిప్‌ అంటూ ఫారిన్‌ వెళ్లిన ఆలియా తాజాగా ఇండియా వచ్చింది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ కొత్త షెడ్యూల్‌ లో పాల్గొనేందుకు రెడీ అవుతోందట.

రామ్‌ చరణ్‌ మరియు ఆలియా భట్‌ ల కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు పలు యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ జరుపబోతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఈ షెడ్యూల్‌ ను జక్కన్న ప్లాన్‌ చేశాడట. భారీ అంచనాలున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో చరణ్‌ కు జోడీగా ఆలియా నటించబోతుండగా ఎన్టీఆర్‌ కు జోడీగా ఫారిన్‌ బ్యూటీ నటించనుంది. ఇంకా ఈ చిత్రంలో నిత్యామీనన్‌ కీలక పాత్రలో కనిపించబోతుంది. బాలీవుడ్‌ స్టార్స్‌ తో పాటు ఇంకా పలువురు నటీనటులు ఈ చిత్రంలో నటించబోతున్నారు. 2020 జులైలో విడుదల కాబోతున్న ఈ చిత్రం బాహుబలి స్థాయిలో ఉండేందుకు జక్కన్న విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Tags:    

Similar News